రామ్ చరణ్‌తో త్రివిక్రమ్.. నిర్మాత ఎవరో తెలిస్తే రచ్చ రచ్చే..

Trivikram Ram Charan: తెలుగు ఇండస్ట్రీలో అభిమానులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ రామ్ చరణ్, త్రివిక్రమ్. మెగా కుటుంబంలో పవన్, అల్లు అర్జున్‌తో మూడేసి సినిమాలు చేసిన త్రివిక్రమ్..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 25, 2020, 2:50 PM IST
రామ్ చరణ్‌తో త్రివిక్రమ్.. నిర్మాత ఎవరో తెలిస్తే రచ్చ రచ్చే..
త్రివిక్రమ్ రామ్ చరణ్ (trivikram ram charan)
  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో అభిమానులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ రామ్ చరణ్, త్రివిక్రమ్. మెగా కుటుంబంలో పవన్, అల్లు అర్జున్‌తో మూడేసి సినిమాలు చేసిన త్రివిక్రమ్.. రామ్ చరణ్‌తో మాత్రం ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా రెండోసారి సినిమా చేస్తున్నాడు ఈయన. జూనియర్ ఎన్టీఆర్‌తో చేస్తున్న అయిననూ పోయిరావలే హస్తినకు సినిమా తర్వాత మళ్లీ మెగా కంపౌండ్‌లోకి అడుగు పెట్టబోతున్నాడు త్రివిక్రమ్. ఈయన పవన్ కళ్యాణ్ హీరోగా సినిమా చేస్తాడనే వార్తలు వస్తున్నా కూడా ఇప్పుడు దాని కంటే కూడా రామ్ చరణ్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు మాటల మాంత్రికుడు.
త్రివిక్రమ్ రామ్ చరణ్ (trivikram ram charan)
త్రివిక్రమ్ రామ్ చరణ్ (trivikram ram charan)


ఇప్పటికే ఈ ఇద్దరూ కలిసి కథ గురించి కూడా చర్చించుకున్నారని తెలుస్తుంది. ఎన్టీఆర్ సినిమా పూర్తైన వెంటనే రామ్ చరణ్ కథపై కూర్చోబోతున్నాడు గురూజీ. ఇదిలా ఉంటే చరణ్ కూడా ప్రస్తుతం ట్రిపుల్ ఆర్‌తో పాటు చిరంజీవి ఆచార్యలో చిన్న పాత్ర చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి, గౌతమ్ తిన్ననూరిల్లో ఎవరో ఒకరితో సినిమా చేయబోతున్నాడు చరణ్. ఈ లోపు త్రివిక్రమ్ కూడా ఎన్టీఆర్ సినిమాను పూర్తి చేయనున్నాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2022లో రామ్ చరణ్, త్రివిక్రమ్ సినిమా తెరపై చూడొచ్చు.
త్రివిక్రమ్ రామ్ చరణ్ (trivikram ram charan)
త్రివిక్రమ్ రామ్ చరణ్ (trivikram ram charan)

ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. ఈ చిత్రానికి నిర్మాత ఎవరో తెలుసా.. పవన్ కళ్యాణ్. అవును.. త్రివిక్రమ్, చరణ్ సినిమాను పవన్ నిర్మించబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. తన అన్న కొడుకుతో సినిమా చేస్తానని చాలా ఏళ్ల క్రితమే అనౌన్స్ చేసాడు పవర్ స్టార్. ఇఫ్పుడు అనుకున్నట్లుగానే ప్రాణ స్నేహితుడితో చరణ్ చేయబోయే సినిమాను నిర్మించాలని చూస్తున్నాడు పవర్ స్టార్. ఒకవేళ ఈ కాంబినేషన్ వర్కవుట్ అయితే మాత్రం అది నిజంగానే మెగాభిమానులకు పండగే.

First published: June 25, 2020, 2:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading