news18-telugu
Updated: December 1, 2020, 8:25 PM IST
ఎన్టీఆర్,త్రివిక్రమ్ (Twitter/Photo)
మాటల మాంత్రికుడు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్.. రాజమౌళి తర్వాత మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ ఈయన. పదునైన సంభాషణలతో సన్నివేశాలను అద్భుతంగా, ఎమోషనల్‌గా మలిచే అతికొద్ది మంది టాలీవుడ్ డైరెక్టర్స్‌లో ఈయన కూడా ఒకరు. ఈ ఏడాది సంక్రాంతికి ‘అల వైకుంఠపురములో’ సినిమాతో నాన్ బాహుబలి రికార్డుల చిత్రాన్ని తెరకెక్కించిన క్రెడిట్‌ను సొంతం చేసుకున్నారు త్రివిక్రమ్. తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో తదుపరి సినిమాను అనౌన్స్ చేశారు. అయితే కోవిడ్ కారణంగా ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)’ సినిమాను ఇంకా పూర్తి చేయలేదు. ఆ ఎఫెక్ట్ త్రివిక్రమ్ సినిమాపై పడింది. ఎప్పుడో ప్రారంభం కావాల్సిన ఈ సినిమా ఆలస్యమవుతూ వస్తుంది.
ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన వార్తొకటి హల్చల్ చేస్తుంది. అదేంటంటే.. త్రివిక్రమ్ ఓ స్టార్ హీరో సినిమానే తనదైన స్టైల్లో మార్చి తీస్తున్నాడట. త్రివిక్రమ్ మార్చి రాసుకునే సినిమా ఎవరిదో కాదు.. కోలీవుడ్ స్టార్ విజయ్‌ది. రెండేళ్ల ముందు విజయ్, ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్లో వచ్చిన ‘సర్కార్’ సినిమా మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమానే త్రివిక్రమ్ అటు ఇటు మార్చి రాస్తున్నాడని టాక్. ఇదే కనుక నిజమైతే ఎన్టీఆర్ తదుపరి సినిమాలో ఎన్నారైగా కనిపించడం ఖాయం. ఈ సినిమాకు ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
పాత సినిమానే తనదైన స్టైల్లో తెరకెక్కించడం త్రివిక్రమ్‌కి కొత్తేమీ కాదు. ఆయన సినిమాలను పరిశీలనగా చూస్తే ఈ విషయాలు మనకు బోధపడతాయి. ఈ ఏడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొంది ఘన విజయం సాధించిన ‘అల వైకుంఠపురములో’ సినిమా పాత ‘ఇంటిగుట్టు’ సినిమానే. అలాగే ‘అఆ‘ సినిమా, నాటి మీనా సినిమానే. ఇప్పుడు అదే స్టైల్లో మరో సినిమానే కొత్తగా తెరకెక్కించబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఎన్టీఆర్ 30 ఆలస్యమవుతున్న నేపథ్యంలో .. త్రివిక్రమ్ రామ్ లేదా నానితో ఓ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు ఎన్టీఆర్‌తో సినిమా స్టార్ట్ అయ్యే లోపలే త్రివిక్రమ్ ఈ సినిమాను పూర్తి చేసేలా ప్లాన్ చేసుకున్నాడని కూడా వార్తలు వినిపించాయి.
‘అరవింద సమేత’ సినిమా తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో ముందు పూజా హెగ్డే పేరు హీరోయిన్గా వినిపించినప్పటికీ, లేటెస్ట్గా హీరోయిన్గా రష్మిక మందన్న నటించే అవకాశం ఉందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయమేమంటే త్రివిక్రమ్ ‘అరవింద సమేత’ స్టైల్లోనే ఈ సినిమాను కూడా రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లోనే తెరకెక్కించబోతున్నాడని అంటున్నారు. మరి ఇందులో నిజా నిజాలు తెలియాలంటే ..సినిమా విడుదల వరకు వేచి ఉండక తప్పదు.
Published by:
Anil
First published:
December 1, 2020, 8:25 PM IST