• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • TRIVIKRAM AND TEAM EXPERIMENTING IT WITH PAWAN KALYAN MHN

Pawan Kalyan - Trivikram: పవన్ కల్యాణ్‌ సినిమా కోసం ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్న త్రివిక్రమ్ అండ్ టీమ్.. అభిమానులకు నచ్చుతుందా?

Pawan Kalyan - Trivikram: పవన్ కల్యాణ్‌ సినిమా కోసం ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్న త్రివిక్రమ్ అండ్ టీమ్.. అభిమానులకు నచ్చుతుందా?

Trivikram and team experimenting it with Pawan Kalyan

Pawan Kalyan - Trivikram: పవన్‌కల్యాణ్‌ హీరోగా సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో రూపొందుతోన్న మలయాళ చిత్రం 'అయ్యప్పనుమ్‌ కోశియమ్‌' సినిమా రీమేక్‌లో పాటలు లేకుండా ఉంటుందని వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి.

  • Share this:
    పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 'వకీల్‌సాబ్‌' చిత్రీకరణను పూర్తి చేసిన పవన్‌కల్యాణ్‌ ఇప్పుడు రెండు సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్లాడు. క్రిష్‌ దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు'(పరిశీలనలో ఉన్న టైటిల్‌) సినిమాతోపాటు మలయాళ చిత్రం 'అయ్యప్పనుమ్‌ కోశియయ్‌' రీమేక్‌లోనూ పవన్‌ నటిస్తున్నారు. ఇందులో సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో త్రివిక్రమ్‌ అబ్జర్వేషన్‌లో రూపొందుతోన్న 'అయ్యప్పనుమ్‌ కోశియమ్‌' సినిమాలో పవన్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తుంటే ఆయనకు ధీటైన పాత్రలో రానా నటిస్తున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్‌ సమాచారం మేరకు ఈ సినిమాలో పాటలు ఉండటం లేదట. ఉంటే గింటే మాంటేజ్‌ సాంగ్స్‌ ఉంటాయి కానీ.. పవన్‌కల్యాణ్‌, రానాలపై రొమాంటిక్‌ సాంగ్స్‌ ఉండవట. పవన్‌కల్యాణ్‌, రానాలపై ఎలాంటి పాటలు లేకుండా సినిమా తీయడమంటే నిజంగా సాహసమనే చెప్పాలి. అలాంటి సాహసానికి దర్శక నిర్మాతలు ప్లాన్‌ చేశారట.

    మరి ఇందులో నిజా నిజాలు తెలియాలంటే కొన్నాళ్లు వెయిటింగ్‌ తప్పదు. ఒకవేళ ఈ ఎక్స్‌పెరిమెంట్‌ నిజమైతే అభిమానులను పవన్‌కల్యాణ్‌, రానాలు ఎలా మెప్పిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. అన్నీ అనుకున్న ప్లానింగ్‌లో జరిగితే ఈ సినిమాను ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేయాలనేది నిర్మాతలు ఆలోచన.

    సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్న ఈ సినిమాకు త్రివిక్రమ్‌ రైటింగ్ డిపార్ట్‌మెంట్ బాధ్యతలను స్వీకరించి ముందుకు నడుపుతుండటం విశేషం. ఓ పోలీసాఫీసర్‌కు, రిటైర్డ్‌ మిలటరీ ఆఫీసర్‌కు మధ్య ఇగో వల్ల గొడవలు వస్తే ఎలా ఉంటుందనేదే కాన్సెప్ట్‌తోనే ఈ సినిమా రూపొందుతుంది. ఈ చిత్రానికి 'రుద్ర ప్రతాప్‌' అనే టైటిల్‌ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
    Published by:Anil
    First published:

    అగ్ర కథనాలు