అల.. వైకుంఠపురంలో.. : ఎన్టీఆర్ సినిమాను కాపీ కొడుతున్న త్రివిక్రమ్?

త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు 1958లో వచ్చిన ఎన్టీఆర్-సావిత్రి క్లాసిక్ 'ఇంటిగుట్టు'కి చాలావరకు దగ్గరి పోలికలు ఉన్నాయట.

news18-telugu
Updated: December 1, 2019, 12:07 PM IST
అల.. వైకుంఠపురంలో.. : ఎన్టీఆర్ సినిమాను కాపీ కొడుతున్న త్రివిక్రమ్?
అల వైకుంఠపురములో’ సినిమా సెట్‌లో అల్లు అర్జున్‌కు సీన్ వివరిస్తున్న త్రివిక్రమ్ (twitter/Photo)
  • Share this:
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'అల..వైకుంఠపురం' సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర కథనం సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు 1958లో వచ్చిన ఎన్టీఆర్-సావిత్రి క్లాసిక్ 'ఇంటిగుట్టు'కి చాలావరకు దగ్గరి పోలికలు ఉన్నాయట.అప్పటి కథనే ఇప్పటి నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి తెరకెక్కిస్తున్నట్టుగా ఫిలిం నగర్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అప్పట్లో వేదాంతం రాఘవయ్య తెరకెక్కించిన ఇంటిగుట్టు సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది.1984లో ఇదే టైటిల్‌తో చిరంజీవి-సుహాసిని హీరో హీరోయిన్లుగా కె.బాపయ్య దర్శకత్వంలోనూ ఓ సినిమా వచ్చింది.

కాగా,అల వైకుంఠపురం సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమాలో బన్నీ సరసన పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన 'సామరవజగమన..' 'రాములో రాములా..' సాంగ్స్ యూట్యూబ్‌లో కొత్త రికార్డులు సెట్ చేశాయి. జులాయి,సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత త్రివిక్రమ్-బన్నీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ పక్కా అంటున్నారు ఫ్యాన్స్.

First published: December 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు