త్రివిక్రమ్‌ను భయపెడుతున్న రాజమౌళి.. జూనియర్ ఎన్టీఆర్ సాక్ష్యం..

త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను రాజమౌళి ఎందుకు భయపెడతాడు అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే జరుగుతుంది మరి. ఈయన తర్వాతి సినిమాను జూనియర్ ఎన్టీఆర్‌తోనే పిక్స్ అయిపోయాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 9, 2020, 6:53 PM IST
త్రివిక్రమ్‌ను భయపెడుతున్న రాజమౌళి.. జూనియర్ ఎన్టీఆర్ సాక్ష్యం..
త్రివిక్రమ్ రాజమౌళి ఫైల్ ఫోటోస్ (Rajamouli Trivikram)
  • Share this:
త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను రాజమౌళి ఎందుకు భయపెడతాడు అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే జరుగుతుంది మరి. ఈయన తర్వాతి సినిమాను జూనియర్ ఎన్టీఆర్‌తోనే పిక్స్ అయిపోయాడు. దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. NTR30 త్రివిక్రమ్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు ఈయన. ఆ తర్వాత కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ లాంటి దర్శకులతో సినిమాలు సెట్ చేసుకున్నాడు ఈయన. ఇందులో త్రివిక్రమ్ సినిమా లాక్‌డౌన్ అయ్యాక రాజమౌళి సినిమా పూర్తైన తర్వాత పట్టాలెక్కనుంది. హారిక హాసినితో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కళ్యాణ్ రామ్ సహ నిర్మాతగా ఉన్నాడు.

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా (ntr trivikram new movie)
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా (ntr trivikram new movie)


ఇదిలా ఉంటే RRR తర్వాత ఈయన త్రివిక్రమ్‌తో చేయబోయే సినిమా పొలిటికల్ టచ్‌తో సాగుతుందని తెలుస్తుంది. అల వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న త్రివిక్రమ్.. ఎన్టీఆర్ సినిమాతో మరోసారి సంచలనం సృష్టించాలని చూస్తున్నాడు. పొలిటికల్ టచ్ ఉంటుంది కాబట్టే ఈ చిత్రానికి అయిననూ పోయిరావలే హస్తినకు అనే టైటిల్ అనుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇదే టైటిల్ రిజిష్టర్ చేయించాడు కూడా. దసరా 2021లో సినిమా విడుదల కానుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా త్వరలోనే మొదలు కానుంది. ఇందులో ఓ రాజకీయ నాయకుడి కొడుకులా నటించబోతున్నాడు ఎన్టీఆర్. పర్ఫెక్ట్ ఫ్యామిలీ పొలిటికల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రానుంది.

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ (Jr NTR Trivikram)
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ (Jr NTR Trivikram)


అరవింద సమేత సినిమా విజయం సాధించినా కూడా బ్లాక్ బస్టర్ అయితే కాదు. దాంతో ఆ బాకీ తీర్చేయాలని చూస్తున్నాడు ఈయన. మహేష్ బాబు భరత్ అనే నేను.. రానా దగ్గుబాటి లీడర్.. విజయ్ దేవరకొండ నోటా తరహాలో అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చే పాత్రలో ఇందులో ఎన్టీఆర్ కనిపిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. అక్కడ్నుంచి రాజకీయాల్లో తనదైన ముద్రను హీరో ఎలా వేశాడనేది ఈ చిత్ర కథ అని ప్రచారం జరుగుతుంది. అయితే త్రివిక్రమ్‌ను ఓ భయం కూడా వెంటాడుతుంది. రాజమౌళి తర్వాత ఆ హీరోకు విజయం రాదు.. ఏ దర్శకుడు చేసినా కూడా పరాజయమే పలకరిస్తుంది. సాహోతో ప్రభాస్‌కు కూడా ఇదే జరిగింది. ఇదే ఇప్పుడు త్రివిక్రమ్‌ను వెంటాడుతున్న భయం.

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ (Jr NTR Trivikram)
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ (Jr NTR Trivikram)


సడన్‌గా తండ్రి చనిపోతే రాజకీయాల్లోకి వచ్చే కథలు చాలానే వచ్చాయి కానీ త్రివిక్రమ్ ఏదో మాయ చేస్తాడని నమ్ముతున్నారు అభిమానులు. లైన్ పాతదే అయినా కూడా స్క్రీన్ ప్లే కొత్తగా రాస్తాడులే అంటున్నారు ఫ్యాన్స్. ఈ చిత్రంలో మరోసారి పూజా హెగ్డేనే హీరోయిన్‌గా ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజమౌళి తర్వాత సినిమా చేసి హీరోకు విజయం అందించడం అంటే చిన్న విషయం కాదు. ఆకాశమంత ఎత్తులో హీరోను కూర్చోబెట్టిన తర్వాత అతన్ని మెల్లగా కిందకి దించి విజయం అందించాలి. మరి ఈ టాస్క్ త్రివిక్రమ్ ఎంతవరకు పూర్తి చేస్తాడనేది చూడాలిక. 2021 దసరా కానుకగా ఎన్టీఆర్ సినిమా విడుదల కానుంది. గతంలో నాగ లాంటి సినిమాలో కాసేపు రాజకీయాలు చేసాడు ఎన్టీఆర్. ఒకవేళ ఈయన పూర్తిస్థాయిలో రంగంలోకి దిగితే ఎలా ఉంటుందనేది త్రివిక్రమ్ చూపించబోతున్నాడన్నమాట.
Published by: Praveen Kumar Vadla
First published: May 9, 2020, 6:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading