ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ కొత్త సినిమా.. మరోసారి సంక్రాంతి బరిలో..

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తాజాగా అల్లు అర్జున్‌తో అల వైకుంఠపురములో అంటూ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

news18-telugu
Updated: January 20, 2020, 3:41 PM IST
ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ కొత్త సినిమా.. మరోసారి సంక్రాంతి బరిలో..
Twitter
  • Share this:
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తాజాగా అల్లు అర్జున్‌తో అల వైకుంఠపురములో అంటూ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. సంక్రాంతి పండుగను టార్గెట్ చేసుకుని విడుదలైన ఈ సినిమా మొదటి నుండి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతూ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం అందుకుంది. బన్నీ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈసినిమా త్రివిక్రమ్‌కు మరపురాని సంక్రాంతిని అందించింది. అయితే త్రివిక్రమ్ మరోసారి ఇదే ఫార్మూలాను రిపీట్ చేయనున్నాడని సమాచారం. అందులో భాగంగా వచ్చే సంక్రాతికి కూడా బరిలో కూడా త్రివిక్రమ్ దిగబోతున్నట్టు తెలుస్తోంది. త్రివిక్రమ్ తన తర్వాతి సినిమాను ఎన్టీఆర్ తో చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి `ఆర్ఆర్ఆర్` షూటింగ్ తో బిజీగా ఉన్నారు. మరోవైపు ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ ప్రస్తుతం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ తాజా సినిమా మే నెల నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్టు సమాచారం. మే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడట త్రివిక్రమ్. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఇంతకు ముందు 'అరవింద సమేత' వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌తో ఈ తాజా సినిమాలో యాక్షన్ పాళ్లు తక్కువగా చూసుకొని.. ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారట. దాదాపు జంధ్యాల సినిమాలను గుర్తుచేసేలా ఈ కథ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల మాట. అంతేకాదు ఈ ప్రాజెక్టును గురించి అధికారిక ప్రకటన కూడా అతి త్వరలో రానున్నదని సమాచారం.

మోడల్ అలెక్సిస్ రెన్ అదిరిపోయే పిక్స్


First published: January 20, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు