Home /News /movies /

TRISHA SHOCKING DECISION OVER QUIT SOCIAL MEDIA TA

Trisha: అభిమానులకు దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన త్రిష..

నిశ్చితార్థం తర్వాత మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోయింది. వరస అవకాశాలతో దూసుకుపోయింది. ఈ మధ్య కూడా 96 లాంటి సంచలన సినిమాలు చేసింది త్రిష.

నిశ్చితార్థం తర్వాత మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోయింది. వరస అవకాశాలతో దూసుకుపోయింది. ఈ మధ్య కూడా 96 లాంటి సంచలన సినిమాలు చేసింది త్రిష.

Trisha: రీసెంట్‌గా త్రిష. చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘ఆచార్య’ సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి త్రిష షాక్ ఇచ్చింది. తాజాగా ఈ భామ తన అభిమానించే ఫ్యాన్స్‌కు దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే..

ఇంకా చదవండి ...
    త్రిష.. తన అభిమానించే ఫ్యాన్స్‌కు దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. హీరో, హీరోయిన్స్ ఎవరైనా వేరే నిర్మాతలకు, దర్శకులకు, తోటి నటీనటులకు డేట్స్ విషయంలో షాక్స్ ఇస్తుంటారు. రీసెంట్‌గా చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘ఆచార్య’ సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి త్రిష షాక్ ఇచ్చింది. తాజాగా ఈ భామ సోషల్ మీడియా అకౌంట్‌ అయిన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ నుంచి తాత్కాలికంగా బ్రేక్ తీసుకుంటున్నట్టు ప్రకటించి సంచలనం రేపింది. ప్రస్తుతానికి నేను నా చుట్టుపక్కల ఏం జరుగుతుందో నాకు తెలియాలను కోవడం లేదు. ఇది నాకు, నా అభిమానులకు మధ్య డిజిటల్ చికిత్స లాంటిది. లవ్ యు గయ్స్.. త్వరలోనే మళ్లీ త్వరలోనే కలుద్దాం అన్నారు త్రిష. దక్షిణాదిలో గత పదిహేనేళ్లుగా కథానాయికగా కొనసాగుతున్న త్రిష.. తెలుగులో ‘నీ మనసు నాకు తెలుసు’ సినిమా ద్వారా పరిచయం అయింది. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా వచ్చిన 'వర్షం' సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసుదోచుకుంది. అక్కడ నుండి త్రిష సినిమాల కోసం ఎదురుచూసింది లేదు. కొన్ని సంవత్సరాలు తెలుగులో టాప్ హిరోయిన్‌లలో ఒకరుగా ఉన్నారు. వరుసగా 'వర్షం', 'నువ్వస్తానంటే నేనోదంటానా', 'అతడు' లాంటీ సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో త్రిష తెలుగులో ఓ వెలుగు వెలిగింది.

    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Kollywood, Tollywood, Trisha

    తదుపరి వార్తలు