TRISHA SENSATIONAL COMMENTS ON OPEN ABOUT HER MARRIAGE ISSUE TA
Trisha: పెళ్లిపై త్రిష సంచలన వ్యాఖ్యలు.. సోలో బ్రతుకే సో బెటర్ అంటున్న తమిళ పొన్ను..
త్రిష (Instagram/Photo)
Trisha: తమిళ పొన్ను త్రిష.. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి అపుడే రెండు దశాబ్దాలు పూర్తి కావొస్తోంది. ఈ ఇరవై ఏళ్ల కెరీర్లో త్రిష.. తెలుగుతో పాటు తమిళంలో నెంబర్ వన్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా త్రిష.. పెళ్లి విషయమై స్పందించింది.
Trisha: తమిళ పొన్ను త్రిష.. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి అపుడే రెండు దశాబ్దాలు పూర్తి కావొస్తోంది. ఈ ఇరవై ఏళ్ల కెరీర్లో త్రిష.. తెలుగుతో పాటు తమిళంలో నెంబర్ వన్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు తెలుగు, తమిళంలో అందరి అగ్ర హీరోల సినిమాల్లో ఆడిపాడింది. ప్రస్తుతం త్రిష వయసు 37 ఏళ్లు. ఐనా.. ఇప్పటికీ పెళ్లి అంటూ చడీచప్పుడు లేకుండా దాట వేస్తోంది. గతంలో ఈ భామ వరుణ్ మణియన్ అనే బిజినెస్‌మేన్‌తో ఎంగేజ్మెంట్ వరకు వెళ్లి పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న త్రిష... ఆ తరువాత మళ్లీ పెళ్లి గురించి ఆలోచించడం లేదనే టాక్ ఉంది.మరోవైపు ఏజ్ మీద పడుతున్నా... సినిమా ఆఫర్లను సొంతం చేసుకోవడంలో త్రిష సక్సెస్ అవుతోంది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్ యంగ్ హీరో శింబును పెళ్లి చేసుకోనుందనే పుకార్లు షికారు చేసాయి. ఆ సంగతి పక్కన పెడితే.. త్రిష పెళ్లి గురించి వ్యాఖ్యానించింది.
త్రిష (Twitter/Photo)
ఈ సందర్భంగా త్రిష మాట్లాడుతూ.. తన మనసుకు నచ్చిన వ్యక్తి దొరికతే.. ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. అర్ధం చేసుకునే వ్యక్తి దొరక్కపోతే.. మ్యారేజ్ చేసుకునే ప్రసక్తి లేదని చెబుతోంది. అప్పటి వరకు ఒంటరి జీవతాన్నే గడుపుతానని అంటోంది. ఒకవేళ త్రిషను అర్ధం చేసుకునే వ్యక్తి దొరక్కపోతే.. లైఫ్ లాంగ్ సింగిల్‌గా గడిపేస్తానే కానీ.. కాంప్రమైజ్ మాత్రం కానంటూ చెప్పుకొచ్చింది త్రిష.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.