Trisha : రివాల్వర్ చేతబట్టిన అందాల త్రిష.. ఎందుకో తెలుసా !

Trisha Krishnan : త్రిష కృష్ణన్ ఓ రివాల్వర్ పట్టుకుని కోపంగా చూస్తున్న ఓ ఫోటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.


Updated: August 16, 2019, 12:47 PM IST
Trisha : రివాల్వర్ చేతబట్టిన అందాల త్రిష.. ఎందుకో తెలుసా !
Photo : Twitter
  • Share this:
Trisha Krishnan : త్రిష కృష్ణన్, 'నీమనసు నాకు తెలుసు' సినిమాతో తెలుగు సినిమాలకు పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తరుణ్‌తో బాగానే ఆడిపాడింది. అయితే సినిమా అనుకున్నంత అలరించలేదు. దీంతో ఈ ముద్దుగుమ్మకు రావాల్సినంత పేరు రాలేదు.  ఆ తర్వాత ప్రభాస్ సరసన 'వర్షం' సినిమాతో ఈ తమిళ పొన్ను అదరగొట్టింది.  ఈ సినిమాలో తన నటనకు మంచి మార్కులే పడ్డాయి. అంతేకాకుండా సినిమా కూడ హిట్ అవ్వడంతో తెలుగులో ఆఫర్స్ విపరీతంగా వచ్చాయి. ఇక అప్పటి నుండి త్రిష సినిమాల కోసం ఎదురుచూసింది లేదు. కొన్ని సంవత్సరాలు తెలుగులో టాప్ హిరోయిన్‌లలో ఒకరుగా ఉన్నారు త్రిష. వరుసగా 'వర్షం', 'నువ్వస్తానంటే నేనోదంటానా', 'అతడు' లాంటీ సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో త్రిష తెలుగులో ఓ వెలుగు వెలిగింది. అయితే ఆ మద్య కాస్తా వెనుకబడిన ఇటీవల తమిళంలో వచ్చిన '96'తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది త్రిష. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ అవ్వడంతో  పాటు విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. దీంతో ఇదే మ్యాజిక్‌ తెలుగులో కూడా రిపీట్ అవుతుందని భావించిన దిల్ రాజు ఈ సినిమాను తెలుగులో శర్వానంద్, సమంత జంటగా రీమేక్ చేస్తున్నారు. తమిళ మాతృకను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే.. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.



 




Loading...

View this post on Instagram




 

#Raangi #secondlookposter


A post shared by Trish (@dudette583) on





అది అలా ఉంటే త్రిష తాజా తమిళ సినిమా 'రాంగి' కోసం రివాల్వర్ చేతబట్టి.. కోపంగా చూస్తూ బెదిరిస్తోంది. 'రాంగి' సినిమాకు ప్రముఖ తమిళ దర్శకుడు A.R. మురుగదాస్ కథను అందిస్తుండగా త్రిష ప్రధాన పాత్ర పోషిస్తోంది. దీనికి సంబందించిన సెకండ్ లుక్‌ను త్రిష తన సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో పంచుకుంది.
First published: August 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...