Trisha Krishnan : త్రిష కృష్ణన్, 'నీమనసు నాకు తెలుసు' సినిమాతో తెలుగు సినిమాలకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా వచ్చిన 'వర్షం' సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసుదోచుకుంది. ఆ తర్వతా నుండి త్రిష సినిమాల కోసం ఎదురుచూసింది లేదు. కొన్ని సంవత్సరాలు తెలుగులో టాప్ హిరోయిన్లలో ఒకరుగా ఉన్నారు. వరుసగా 'వర్షం', 'నువ్వస్తానంటే నేనోదంటానా', 'అతడు' లాంటీ సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో త్రిష తెలుగులో ఓ వెలుగు వెలిగింది. ఇక ఆమె వెండితెర ఎంట్రీ ఇచ్చి ఇరవై ఏళ్ళు గడిచింది. సౌత్‌లో దాదాపు టాప్ హీరోలతో రోమాన్స్ చేసిందీ ఈ చెన్నై చంద్రం. ప్రస్తుతం త్రిష వయసు కూడా నలభైకి దగ్గరలో ఉంది. త్రిష ప్రేమలో పడిందని.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతుందని గత ఐదారేళ్ళగా వింటూనే ఉన్నాం. ఆ మధ్య నిశ్చతార్ధం కూడా జరిగి ఆ తర్వాత క్యాన్సల్ అయిపొయింది. త్రిష కొన్నాళ్లు తెలుగులో ఓ యువ హీరోతో లవ్‌లో ఉన్నదని టాక్ వచ్చింది. ఆ తర్వాత అదంతా ఏం లేదని అన్నారు. ఇక త్రిష మరోవైపు వరుణ్ మణియన్ అనే వ్యాపారవేత్తతో ప్రేమలో పడి.. అతడితో నిశ్చితార్థం కూడా చేసుకుంది. నిశ్చితార్థం తర్వాత వచ్చిన కొన్ని మనస్పర్థల కారణంగా పెళ్లిని రద్దు చేసుకున్నారు ఈ జంట.
ఇక తాజాగా ఇప్పుడు ఓ తమిళ దర్శకుడితో త్రిష మరోసారి ప్రేమలో పడిందని అంటున్నారు. అంతేకాదు త్వరలోనే వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఓ వార్త తమిళ చిత్రసీమలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇక త్రిష నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే... తెలుగులో ప్రస్తుతం తన జోరును తగ్గించేసింది త్రిష. దీనికి కారణం ఆమె నటించిన సినిమాలు పెద్దగా ఆకట్టకుకోలేకపోతున్నాయి. ముఖ్యంగా తెలుగులో ఆమె సినిమాలేవి రావడం లేదు.
అయితే తమిళ్లో మాత్రం 96 సినిమాతో ఒక్కసారిగా మళ్లి త్రిష కెరీర్ పుంజుకుంది. తెలుగులో చిరంజీవి సరసన ఆచార్యలోనటించాల్సీ ఉండగా.. ఆ సినిమానుంచి ఏవో కొన్ని కారణాల వల్ల ఆమె తప్పుకుంది. ఆమె ప్లేస్‌లో కాజల్ వచ్చి చేరింది. స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న 'పొఇన్నియన్ సెల్వన్' కీలకపాత్ర పోషిస్తోంది.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.