Trisha Krishnan : త్రిష.. ఏ యం రత్నం నిర్మించిన 'నీమనసు నాకు తెలుసు' సినిమాతో తెలుగు సినిమాలకు పరిచయం అయ్యింది. అయితే ఆ సినిమా పెద్దగా అలరించకపోవడంతో పెద్దగా గుర్తింపు దక్కలేదు. కానీ ఆ తర్వాత ప్రభాస్ హీరోగా శోభన్ దర్శకత్వంలో వచ్చిన 'వర్షం' సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసుదోచుకుంది. ఆ సినిమాలో త్రిష వర్షంలో డ్యాన్స్.. ఆమె నటన త్రిషకు తెలుగులో విపరీతమైన క్రేజ్’ను తీసుకొచ్చింది. ఆ తర్వతా నుండి త్రిష సినిమాల కోసం ఎదురుచూసింది లేదు. కొన్ని సంవత్సరాలు తెలుగులో టాప్ హిరోయిన్లలో ఒకరుగా ఉన్నారు. వరుసగా 'వర్షం', 'నువ్వస్తానంటే నేనోదంటానా', 'అతడు' లాంటీ సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో త్రిష తెలుగులో ఓ వెలుగు వెలిగింది. ఇక ఆ తర్వాత ఇటీవల మరోసారి త్రిష తన స్టామీనాను చూపించింది. తమిళ్లో 96పేరుతో వచ్చిన ఆ సినిమాలో త్రిష తన నటనతో యువ హృదయాల్నీ దోచుకుంది. త్రిష సినీ ఇండస్ట్రీకి వచ్చి ఇరవై ఏళ్లు గడిచినా.. తనకి 37 ఏళ్లు వచ్చినా.. డిమాండ్ తగ్గకుండా ఇంకా అగ్ర స్థానంలోనే వుంటూ సినిమాలు చేస్తోంది.
త్రిష, అరవింద్ స్వామి Photo : Twitter
అందులో భాగంగా ఆమె అరవింద్ స్వామితో మూడు సంవత్సరాల క్రితం ఓ సినిమా చేసింది. 'శతురంగ వెట్టయ్ -2' అంటూ తమిళ్లో తెరకెక్కిన ఆ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. కానీ ఏవో కారణాల వల్ల ఇంకా విడుదలకు నోచుకోలేదు. అయితే ఇప్పటి పరిస్థితులు ఈ సినిమా విడుదలకు అనుకూలిస్తున్నాయి. కరోనా కారణంగా పెద్ద సినిమాల నుంచి చిన్న సినిమాల వరకు ఓటీటీలో విడుదలవున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోస్ మంచి రేటు ఆఫర్ చేసి హక్కుల్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎప్పటినుండో విడుదలకోసం ఎదురుచూస్తోన్న ఈ సినిమా త్వరలోనే ఈ అమెజాన్ ప్రైమ్ ద్వారా డైరెక్టుగా రిలీజ్ కానుంది.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.