సౌత్‌లో అగ్ర కథానాయికగా రాణిస్తున్న త్రిష.. ఈ మంగళవారం పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు ఆమెకు బర్త్ డే విషెస్ తెలియజేసారు. ఈ సందర్భంగా చిరంజీవి త్రిషకు మధ్య ట్విట్టర్ వేదికగా ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.
సౌత్‌లో అగ్ర కథానాయికగా రాణిస్తున్న త్రిష.. ఈ మంగళవారం పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు ఆమెకు బర్త్ డే విషెస్ తెలియజేసారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కూడా త్రిషకు బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేసారు. జన్మదిన శుభాకాంక్షలు త్రిష.. నీ జీవితం సంతోషం, విజయాలతో నిండిపోవాలని కోరుకుంటున్నా. అంతేకాదు ఈ ఇయర్ నీకు గొప్పగా ఉండాలని ఆశిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. దీనికి త్రిష.. రిప్లై ఇస్తూ.. స్వీటెస్ట్ లెజెండ్ చిరంజీవికి ధన్యవాదాలు అని ట్వీట్ చేసారు. రీసెంట్గా త్రిష.. చిరంజీవి హీరోగా నటిస్తోన్న ‘ఆచార్య’సినిమా నుంచి తప్పుకుంది. ఆ తర్వాత త్రిష, చిరంజీవి మధ్య జరిగిన ఈ మాటలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. వీళ్లిద్దరు గతంలో ‘స్టాలిన్’ సినిమాలో కలిసి నటించారు.
Happy Birthday Trisha @trishtrashers Wish you all the happiness and success all the way along. Have a wonderful year ahead!
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 4, 2020
ఇక కొరటాల శివ, చిరంజీవి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘ఆచార్య’ చిత్రంలో ముందుగా కథానాయికగా త్రిషను తీసుకున్నారు. వీళ్లిద్దరి మధ్య కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించారు కూడా. కానీ పలు కారణాల వల్ల త్రిష.. ఈ ప్రాజెక్ట్ నుంచి హీరోయిన్గా పక్కకు తప్పుకుంది. ఆమె స్థానంలో కాజల్‌ను హీరోయిన్గా తీసుకున్నారు. ఈమె కూడా ఈ చిత్రం నుంచి తప్పుకుందనే వార్తలు గుప్పుమన్నాయి. ఇక కాజల్ ఈ సినిమా నుంచి నేనెమి తప్పుకోలేదంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. ఆచార్య విషయానికొస్తే.. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్తో కలిసి కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్లో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో రామ్ చరణ్ మరో ముఖ్యపాత్రలో నటించబోతున్నాడు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.