Home /News /movies /

TRISHA INSULTING TELUGU HEROES HERE ARE THE DETAILS TA

తెలుగు హీరోలపై అలా ప్రతీకారం తీర్చుకున్న త్రిష..

త్రిష (Instagram/dudette583)

త్రిష (Instagram/dudette583)

అందాల భామ త్రిష తెలుగు హీరోలపై అలా ప్రతీకారం తీర్చుకుంది. ఇంతకీ ఏమి జరిగిందంటే..

    అందాల భామ త్రిష తెలుగు హీరోలపై అలా ప్రతీకారం తీర్చుకుంది. ఇంతకీ ఏమి జరిగిందంటే.. సౌత్ ఇండియాన్ బ్యూటీ త్రిషకు తెలుగుతో పాటు తమిళంలో దాదాపు దశాబ్దంపైగా కథానాయికగా రాణిస్తోంది. తెలుగులో ఈ భామకు అంతగా అవకాశాలు రాకపోయినా.. తమిళంలో మాత్రం రఫ్పాడిస్తూనే ఉంది. రీసెంట్‌గా చిరంజీవి సినిమాలో కథానాయికగా అవకాశం వచ్చినా.. వేరే సినిమాలో అవకాశం రావడంతో చిరంజీవి సినిమాకు నో చెప్పింది. ఆ తర్వాత చిరంజీవి తన నెక్ట్స్ సినిమాలో మరో అవకాశం ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఐతే.. తమిళం కంటే ముందే త్రిషకు తెలుగులో హీరోయిన్ ‌గా మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. తెలుగు చిత్రాలతోనే ఈమెకు హీరోయిన్‌గా క్రేజ్ పెరిగింది. తెలుగులో సీనియర్ హీరోలు, యంగ్ హీరోలందరి సరసన రొమాన్స్ చేసిన అతి కొద్ది మంది హీరోయిన్లలో ఒకరుగా త్రిష గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆమెకు దృష్టిలో ఉత్తమ నటులెవరూ టాలీవుడ్‌లో లేరు. తాజాగా ఈమె సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో ఛాటింగ్ చేసిన త్రిష... ఆమెకు నచ్చిన ముగ్గురు బెస్ట్ హీరోల ఎవరిని చెబితే.. . తన నచ్చిన బెస్ట్ హీరోలు కమల్ హాసన్, మోహన్ లాల్, ఆమీర్ ఖాన్ అని చెప్పింది. అయితే ఈ లిస్టులో తెలుగు హీరోలెవరూ లేకపోవడం గమనార్హం.ఈ విధంగా త్రిష.. తెలుగు హీరోలపై అలా ప్రతీకారం తీర్చుకుందా అని అందరు చెవులు కొరుక్కుంటున్నారు.ఏమైనా ఎవరి నచ్చిన హీరోలు వారికి ఉంటారు. త్రిషకు తెలుగులో ఏ హీరో నచ్చక పోవచ్చు అందులో పెద్ద విషయమేమి లేదు.  అంత మాత్రానా తెలుగు హీరోలను త్రిష అవమానిచ్చినట్టు ఎలా అవుతుందని ఇంకొంత మంది ప్రశ్నిస్తున్నారు. ఏమైనా ఎవరి అభిప్రాయం వారిది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Chiranjeevi, Kollywood, Tollywood, Trisha

    తదుపరి వార్తలు