బాలీవుడ్‌లో మరో ఇంట్రెస్టింగ్ బయోపిక్..ఆమీర్ లేదా అక్షయ్ నటించే అవకాశం

కొన్నేళ్లుగా బాలీవుడ్ అండ్ టాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీస్‌లో చారిత్రక నేపథ్యమున్న సినిమాలను తెరకెక్కించడానికి మూవీ మేకర్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. తాజాగా భారత దేశంలో ట్రైబల్ ఫ్రీడం ఫైటర్ బిర్సా ముండా జీవిత కథపై సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని ‘కబాలి’, ‘కాలా’ ఫేమ్ రంజిత్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు.

news18-telugu
Updated: November 15, 2018, 2:05 PM IST
బాలీవుడ్‌లో మరో ఇంట్రెస్టింగ్ బయోపిక్..ఆమీర్ లేదా అక్షయ్ నటించే అవకాశం
అమీర్, అక్షయ్
  • Share this:
కొన్నేళ్లుగా బాలీవుడ్ అండ్ టాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీస్‌లో చారిత్రక నేపథ్యమున్న సినిమాలను తెరకెక్కించడానికి మూవీ మేకర్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌లో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పద్మావత్’ మూవీ బాలీవుడ్‌లో సూపర్ హిట్‌గా నిలిచింది. దీపికా,రణ్‌వీర్, షాహిద్ ముఖ్యపాత్ర్లో నటించిన ఈ మూవీ రూ.300 కోట్ల వసూళ్లను సాధించింది.

అంతకు ముందు భన్సాలీ దర్శకత్వంలో ..రణ్‌వీర్, దీపికా, ప్రియాంక చోప్రాలతో తెరకెక్కిన ‘బాజీరావు మస్తానీ’ కూడా బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిన విషయమే కదా. మరోవైపు తెలుగులో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ వంటి చారిత్రక సిన్మాతో పెద్ద సెన్సేషనే క్రియేట్ చేసిన క్రిష్...ఇపుడు కంగనా రనావత్ హీరోయిన్’గా ఝాన్సీ లక్ష్మీ బాయి జీవిత కథ ఆధారంగా ‘మణికర్ణిక’ టైటిల్‌తో బయోపిక్ మూవీని తెరకెక్కించాడు. ఈ మూవీని వచ్చే యేడాది రిపబ్లిక్ డే కానుకగా రిలీజ్ చేస్తున్నారు.

మణికర్ణిక (ట్విట్టర్ ఫోటో)


ఇంకోవైపు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్..మరాఠా యోధుడు శివాజీ దగ్గర సుబేదార్ గా పనిచేసిన తానాజీ జీవితంపై ‘తానాజీ’ మూవీ చేస్తున్నాడు. లేటెస్ట్‌గా అజయ్ దేవ్‌గణ్.. భారత దేశ చరిత్రలో నంద వంశాన్ని నాశనం చేసి మౌర్య సామ్రాజ్య స్థాపన చేసిన చాణుక్యుడి జీవితంపై తెరకెక్కే ‘చాణక్య’ మూవీలో టైటిల్ పాత్రను పోషిస్తున్నాడు. నీరజ్ పాండే ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు.

తానాజీ మూవీలో అజయ్


మరోవైపు అజయ్ దేవ్‌గణ్ తోటి హీరో అక్షయ్ కుమార్ కూడా 1897ల పాకిస్థాన్ లున్న సారాగర్హిల జరిగిన యుద్ధ నేపథ్యంల ‘కేసరి’ అనే బయోపిక్ మూవీ చేస్తున్నాడు. అనురాగ్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని కరణ్ జోహార్‌తో కలిసి అక్షయ్ కుమారే నిర్మిస్తున్నాడు. మరోవైపు మంగళాన్ నేపథ్యంలో ‘మిషన్ మంగళ్’ మూవీ చేస్తున్నాడు.

మరోవైపు హృతిక్‌తో ‘జోదా అక్బర్’, ‘మొహంజోదారో’ వంటి హిస్టారికల్ మూవీస్ తెరకెక్కించిన అశుతోష్ గోవారికర్...ఇపుడు సంజయ్ దత్, అర్జున్ కపూర్‌లతో మూడో పానిపట్టు యుద్ధ నేపథ్యలో ‘పానిపట్’ అనే యుద్ధ నేపథ్య సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇంకోవైపు రణ్‌బీర్ కపూర్ కూడా యశ్ రాజ్ ఫిల్మ్ బ్యానర్‌లో కరణ్ మల్మోత్ర డైరెక్షన్‌లో ‘షంషేరా’ అనే మూవీ చారిత్రక నేపథ్యమున్న సినిమానే చేస్తున్నాడు.
పానిపట్ మూవీ


మరోవైపు కరణ్ జోహార్ ఆయన స్వీయ దర్శకత్వంలో...మొఘల్ సింహాసనం కోసం జరిగిన యుద్ధ నేపథ్యంలో ‘తఖ్త్’అనే చారిత్రక నేపథ్యమున్న సినిమాను తెరకెక్కిస్తున్నాడు. వారసత్వం..ప్రేమ..ద్రోహం అనే ఇతివృత్తంతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో రణ్‌వీర్ సింగ్ ఔరంగజేబ్ పాత్రలో నటిస్తున్నాడు. ఆయన సోదరి జహనారా బేగం పాత్రలో కరీనా కపూర్ నటిస్తోంది. ఈ మూవీలో కథానాయికలుగా ఆలియా భట్, జాన్వీ కపూర్‌లు నటిస్తున్నారు.

Bollywood History Mania
తఖ్త్ (ఫైల్ ఫోటో)


తాజాగా భారత దేశంలో ట్రైబల్ ఫ్రీడం ఫైటర్ బిర్సా ముండా జీవిత కథపై సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని ‘కబాలి’, ‘కాలా’ ఫేమ్ రంజిత్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీని షరీమ్ మంత్రి, బియాండ్ క్లౌడ్స్ అనే సంస్త సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ అకౌంట్‌లో వెల్లడించాడు.ఈ మూవీని రూ.175 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్నారు. ఈ బయోపిక్‌లో బిర్సా ముండా పాత్రలో ఆమీర్ ఖాన్ లేదా అక్షయ్ కుమార్‌లు నటించే అవకాశాలున్నాయని బీటౌన్ వర్గాలు చెబుతున్నాయి. 2019 యేడాదిలో ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. మొత్తానికి బాలీవుడ్‌ ఫిల్మ్ మేకర్స్..ఒకదాని వెంట ఇంకొకటి చారిత్రక నేపథ్యమున్న సినిమాలు తెరకెక్కించడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: November 15, 2018, 2:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading