Priyanka Singh - Uma Devi: బుల్లితెరపై రియాలిటీ షోలలో మంచి క్రేజ్ సంపాదించుకున్న షో బిగ్ బాస్. ఇప్పటికే ఈ షో నాలుగు సీజన్ లు పూర్తి చేసుకోగా సీజన్ 5 ప్రారంభమయింది. ఇక ఈ సీజన్ మరింత హైలెట్ గా కనిపించగా ఇందులో మొత్తం 19 మంది కంటెస్టెంట్ లు పాల్గొన్నారు. అందులో బుల్లితెర, వెండితెర సెలబ్రేటీలు , టీవీ యాంకర్లు, సోషల్ మీడియా సెలబ్రెటీలు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే తాజాగా అర్థపావు భాగ్యం కు చుక్కలు చూపించింది ట్రాన్స్ జెండర్ పింకి.
ఈ షో ప్రారంభమై వారం రోజులు కూడా కాలేదు అప్పుడే గొడవలు, కాంట్రవర్సీలు జరుగుతున్నాయి. అంతేకాకుండా గ్రూపులు గ్రూపులుగా కూడా విడిపోయి తోటి కంటెస్టెంట్ ల గురించి గుసగుసలుగా మాట్లాడుతున్నారు. ఇక అక్కడక్కడ ఎమోషనల్ సీన్స్ కూడా కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈ సీజన్ మొదటి నుండే బాగా ఆసక్తిగా అనిపించింది.
ఇది కూడా చదవండి: అనవసరంగా ఆమెతో గొడవ పెట్టుకున్న.. నాగార్జున పేరు వాడుతూ అలా నోరు జారిన జెస్సీ
ఇక తాజా ఎపిసోడ్ లో బెస్ట్ పర్ఫార్మర్, వేస్ట్ పర్ఫార్మర్ లను సెలెక్ట్ చేయమని బిగ్ బాస్ తెలుపగా అందులో కంటెస్టెంట్ లు అందరూ బెస్ట్, వేస్ట్ పర్ఫార్మర్ ల గురించి వివరించారు. ఇక ఇందులో ప్రియాంక అలియాస్ పింకీ కాస్త ఎమోషనల్ తో పాటు కోపం కూడా తెచ్చుకుంది. తన చిన్నప్పటి నుంచి జీవితం ముళ్ళ పాన్పుపై సాగింది అంటూ.. అందర్నీ అన్నయ్య అంటున్నాను.. ప్రేమగా ఉంటున్నాను అంటే తన అన్నయ్యలు పెద్దవాళ్ళు అయ్యారని బాధ్యతలతో బయటికి వెళ్ళారని.. ప్రతి ఒక్కరిని అన్నయ్య అనే ఫీలింగ్ తో పిలుస్తానని తెలిపింది. లోబో గురించి మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ గా మాట్లాడింది. బెస్ట్ పర్ఫార్మర్ లోబో అన్నయ్య అంటూ ఆయనను పొగిడింది.
ఇది కూడా చదవండి:బిగ్ బాస్ హౌస్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్న మరో హాట్ బ్యూటీ.. ఎవరంటే?
ఇక కార్తీక దీపం అర్థపావు భాగ్యం కు మాత్రం ఏకంగా చుక్కలే చూపించింది పింకీ. వరెస్ట్ పర్ఫార్మర్ గా ఉమా దేవి పేరు చెప్పడంతో వారి మధ్య కాస్త గొడవ జరిగింది. ఆమెను పెద్దవారు అంటూ మాట్లాడుతున్న మధ్యలో కోపంతో నోరుముయ్ అనడంతో మొదలైంది. ఇక పింకీ సారీ చెప్పిన కూడా ఉమా బాగా ఫైర్ అయ్యింది. దీంతో సరయు మధ్యలో ఉమాదేవిని ఉద్దేశించి మాట్లాడింది. ఇక తర్వాత ప్రియాంక తను నోరుముయ్ అనే మాటను అని తప్పు చేశాను అనుకుంటూ ఏడ్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bigg boss season 5 telugu, Star Maa, Transgender priyanka singh, Uma devi