కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విజయ్ ప్రస్తుతం తమిళ్, తెలుగు సినిమాల్లో బిజీగా మారాడు. తెలుగులో విలన్ పాత్రలు పోషిస్తూ.. ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తాజాగా విజయ్ సేతుపతి, కమెడియన్ సూరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘విడుతలై’. క్రైమ్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాకు ప్రముఖ నిర్మాత వెట్రిమారన్ దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ అంచనాలున్న ఈ సినిమా గత రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే తాజాగా ఈ షూటింగ్లో ఓ విషాదం చోటు చేసుకుంది.
చెన్నై సమీపంలోని వండలూరులో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా షూటింగ్లో తాడు తెగిపడి ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఇందులో చిక్కుకున్న ఫైటింగ్ కోచ్ సురేష్ చనిపోయినట్లు తెలుస్తోంది. అంతకుముందు, అతను తీవ్రంగా గాయపడి చికిత్స కోసం కేలంబాక్కంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. ఈ దుర్ఠటనపై లిబరేషన్ ఫిల్మ్స్ బృందం వివరణ ఇస్తుందని భావిస్తున్నారు. ఈ ఘటనతో చిత్ర బృందం తీవ్ర విషాదంలో నిండిపోయింది.
జయమోహన్ రాసిన అపపవన్ నవల ఆధారంగా ఈ చిత్రంలో సూరి, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు పోషించారు. 2020లో షూటింగ్ మొదలైంది. కథ విస్తరణ దృష్ట్యా 'విడుతలై' సినిమాని రెండు భాగాలుగా తీయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా మొదటి భాగం జనవరి 26న థియేటర్లలోకి రానుంది. ఆ తర్వాత అభిమానులను ఎక్కువ కాలం వెయిట్ చేయడం ఇష్టం లేని వెట్రిమారన్ త్వరలో రెండో భాగాన్ని విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు.
విజయ్ సేతుపతి తమిళంలో వచ్చిన 'తెన్మెర్కు పరువాకత్రు' సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. అంతకుముందు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించాడు. ఆయన తమిళంలో నిర్మాతగా, స్క్రీన్ ప్లే రచయితగా, పాటల రచయితగా, గాయకుడిగా కూడా కొన్ని సినిమాలకు పనిచేశాడు. విజయ్ సేతుపతి తెలుగులో 2019లో వచ్చిన సైరా నరసింహారెడ్డి సినిమా ద్వారా తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టాడు. 2021లో ఉప్పెన సినిమాలోని రాయణం పాత్రలో ఆయన చేసిన నటన ద్వారా తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kollywood News, Vijay Sethupathi