Home /News /movies /

TOPLESS WOMAN UKRAINE PROTEST ON CANNES RED CARPET SB

Cannes Film Festival 2022: కేన్స్ ఫెస్టివల్‌.. రెడ్ కార్పెట్‌పై దుస్తులు విప్పేసిన హీరోయిన్

కేన్స్ ఫెస్టివల్‌లో నగ్నంగా నటి నినాదాలు

కేన్స్ ఫెస్టివల్‌లో నగ్నంగా నటి నినాదాలు

సెలబ్రిటి ఒక్కసారిగా రెడ్‌ కార్పెట్‌పైకి వెళుతూ.. ఒక్కసారిగా తన దుస్తులను విప్పేసింది. దీంతో అక్కడున్న సిబ్బంది వెంటనే ఆమెపై కోటు వేసి అక్కడ్నుంచి తీసుకెళ్లారు.

    కేన్స్ ఫెస్టివల్(Cannes 2022) కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ ఫెస్టివల్‌కు వరల్డ్ వైడ్‌గా అందమైన నటులు పాల్గొంటారు. ఈ ఫెస్టివల్ ఎంతో అట్టహాసంగా కొనసాగుతోంది. ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న ఈ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు వేలాది మంది నటినటులు హాజరై తళుక్కుమంటున్నారు. ఈ క్రమంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అయితే ఫిల్మ్ ఫెస్టివల్‌ వేదికగా రెడ్ కార్పెట్‌పై ఉక్రెయిన్‌కు చెందిన ఓ నటి వినూత్నంగా నిరసన తెలిపింది. తమ దేశం ఉక్రెయిన్‌లో మహిళలు, యువతులపై రష్యా సైనికుల అఘాయిత్యాలను ఆపండి అంటూ ఆమె అర్ధనగ్నంగా నినాదాలు చేసింది.

    దీంతో ఒక్కసారిగా అక్కడున్న సిబ్బంది అలర్ట్ అయ్యారు. ఆమెను చుట్టుముట్టి బయటకు తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకున్నట్లు కెన్స్ ప్రతినిధులు తెలిపారు. కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో రెడ్ కార్పెట్‌పై నటీమణులు వాక్ చేస్తుండగా.. ఆమె ఒక్కసారిగా తన దుస్తుల్ని తొలగించింది.

    ఉక్రెయిన్‌ చెందిన సెలబ్రిటి ఒక్కసారిగా రెడ్‌ కార్పెట్‌పైకి వెళుతూ.. ఒక్కసారిగా తన దుస్తులను విప్పేసింది. అంతటితో ఆగకుండా నినాదాలు చేసింది. ఆమె శరీరంపై ఉక్రెయిన్‌ జెండా రంగులను వేసుకొని.. తమపై జరిగే అత్యాచారాలను ఆపండి అంటూ నినాదాలు చేసింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది ఆమెపై దుస్తులు కప్పి అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో 'త్రీ థౌజెండ్ ఇయర్స్ ఆఫ్ లాంగింగ్' సినిమాకు సంబంధించిన ఇడ్రిస్ ఎల్బా, టిల్డా స్వింటన్ వంటి ప్రముఖ సినీ నటులు కూడా ఉన్నారు.

    ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలైన దగ్గర నుంచి అక్కడి మహిళలపై రష్యన్ బలగాలు అత్యాచారాలు చేస్తున్నారనే కథనాలు వస్తున్నాయి. మరోవైపు కేన్స్ ఫెస్టివల్‌లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ భావోద్వేగ ప్రసంగం చేశారు. కేన్స్‌ ప్రారంభోత్సవంలో జెలెన్‌ స్కీ ఉక్రెయిన్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌పై రష్యా బలగాల దాడుల్లో తమ దేశ పౌరులు వేల సంఖ్యలో చనిపోతుంటే.. సినీ ప్రపంచం మౌనంగా ఉంటుందా అంటూ ప్రశ్నించారు. దీంతోపాటు రష్యా సేనలు తమ పౌరులపై దారుణాలకు దిగుతున్నాయని.. మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సినీ ప్రపంచం దీనిపై స్పందించాలని జెలెన్‌స్కీ కోరారు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Cannes Film Festival, Hollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు