చిరంజీవికి మరో షాక్.. ఆచార్య నుంచి ఆయన ఔట్..

Acharya movie: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం లాక్ డౌన్ హాలీడేస్ కుటుంబంతో పాటు ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక సినిమాల విషయానికొస్తే ఈయన ప్రస్తుతం కొరటాల శివతో ఆచార్య సినిమాతో..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 2, 2020, 9:54 PM IST
చిరంజీవికి మరో షాక్.. ఆచార్య నుంచి ఆయన ఔట్..
చిరంజీవి (Megastar Chiranjeevi)
  • Share this:
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం లాక్ డౌన్ హాలీడేస్ కుటుంబంతో పాటు ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక సినిమాల విషయానికొస్తే ఈయన ప్రస్తుతం కొరటాల శివతో ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నాడు. సైరా లాంటి హై ఓల్టేజ్ సినిమా తర్వాత ఈయన చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా పెరిగిపోతున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి బయటికి వచ్చే వాళ్లు కూడా ఎక్కువగానే ఉన్నారు. మొన్నటికి మొన్న హీరోయిన్ త్రిష ఆచార్య నుంచి తప్పుకుంటున్నట్లు పోస్ట్ చేసింది. క్రియేటివ్ డిఫెరెన్సుల కారణంగానే ఈ చిత్రాన్ని వదిలేస్తున్నట్లు చెప్పింది త్రిష. కొణిదెల ప్రొడక్షన్, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

చిరంజీవి కొరటాల సినిమా లుక్ లీక్ (chiranjeevi new movie title acharya)
చిరంజీవి కొరటాల సినిమా లుక్ లీక్ (chiranjeevi new movie title acharya)


త్రిష కాదనుకున్న స్థానంలోకి కాజల్ వచ్చింది. ఈమెకు ఈ సినిమా కోసం దాదాపు 2 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు ప్రచారం కూడా జరుగుతుంది. ఇక చాలా ఏళ్ళ తర్వాత చిరంజీవి సినిమాకు మరోసారి మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాను 2020లో విడుదల చేయాలనుకున్నా కూడా అనుకున్న దానికంటే ఆలస్యం కావడంతో 2021 సమ్మర్‌కు వాయిదా వేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రం నుంచి ఇప్పుడు ఎడిటర్ శ్రీకర ప్రసాద్ తప్పుకున్నట్లు తెలుస్తుంది. దానికి ప్రత్యేకమైన కారణాలేవీ కూడా ఏమీ కనిపించడం లేదు.

చిరంజీవి ఆచార్య (Sreekar Prasad out of Chiranjeevi Acharya movie)
చిరంజీవి ఆచార్య (Sreekar Prasad out of Chiranjeevi Acharya movie)


అనుకున్న సమయానికి షూటింగ్ కాకపోవడంతో తనకు ఇతర ప్రాజెక్టుల కారణంగా చిరు సినిమాను వదిలేస్తున్నాడు శ్రీకర ప్రసాద్. దర్శక నిర్మాతలతో పూర్తిగా చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆచార్య షెడ్యూల్స్ అనుకున్న దానికంటే కూడా కాస్త ఆలస్యం అయితే అవుతున్నాయి. మరోవైపు ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా మరింత లేట్ అవుతుంది. దాంతో తనకు ఇతర సినిమాలు కూడా ఉండటంతో ఆచార్య నుంచి తప్పుకోక తప్పని పరిస్థితి. ఈ మధ్యే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లోకి కూడా ఎక్కాడు ఈయన. శ్రీకర్ ప్రసాద్ వదిలేసిన స్థానంలో నవీన్ నూలిని ఎడిటర్‌గా తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
First published: April 2, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading