హోమ్ /వార్తలు /సినిమా /

సుమ కనకాల అరుదైన ఫోటో.. 90ల్లో ఇలా ఉండేది..

సుమ కనకాల అరుదైన ఫోటో.. 90ల్లో ఇలా ఉండేది..

యాంకర్ సుమ (suma kanakala)

యాంకర్ సుమ (suma kanakala)

Suma Kanakala: సుమ కనకాల.. పరిచయం అక్కర్లేని పేరు. ఇంకా చెప్పాలంటే ప్రతీ ఇంట్లో కూడా ఈ పేరుతో పరిచయం ఉంది. అందరి ఇంటి మనిషిలా మారిపోయింది సుమ. యాంకర్‌గానే కాకుండా..

సుమ కనకాల.. పరిచయం అక్కర్లేని పేరు. ఇంకా చెప్పాలంటే ప్రతీ ఇంట్లో కూడా ఈ పేరుతో పరిచయం ఉంది. అందరి ఇంటి మనిషిలా మారిపోయింది సుమ. యాంకర్‌గానే కాకుండా ఇంట్లో మనిషిలా ఈమెను ఫీల్ అవుతుంటారు అంతా. సుమ కూడా అలాగే అందరిని నవ్విస్తుంటుంది. సరదాగా ఉంటుంది కాబట్టే ఇప్పటి వరకు ఈమెకు తిరుగులేదు.. ఈమె లాంటి యాంకర్ మళ్లీ తెలుగులో వస్తుందా రాదా అనేది కూడా అనుమానమే. ఎంతమంది యాంకర్స్ ఉన్నా కూడా సుమ కనకాల ఇప్పటికీ అగ్రస్థానంలోనే కొనసాగుతుంది.

యాంకర్ సుమ (suma kanakala)
యాంకర్ సుమ (suma kanakala)

ఝాన్సీ, ఉదయభాను లాంటి వాళ్లు యాంకర్‌లుగా ఉన్నపుడు సుమ సినిమాలతో బిజీగా ఉంది.. మధ్యలో కొన్ని సీరియల్స్ కూడా చేసింది. అప్పట్లో దిగిన ఫొటోషూట్ ఇప్పుడు ఒకటి బాగా వైరల్ అవుతుంది. ఆ మధ్య తన సోషల్ మీడియా పేజీలో అభిమానులతో పంచుకుంది సుమ. పెళ్లికి ముందు.. సీరియల్స్ చేసే సమయంలో దిగిన ఫోటోను షేర్ చేసింది ఈ సీనియర్ యాంకర్. అందులో చాలా అందంగా.. హీరోయిన్ మాదిరే ఉంది సుమ.

యాంకర్ సుమ రేర్ ఫోటో (anchor suma old photo)
యాంకర్ సుమ రేర్ ఫోటో (anchor suma old photo)

నిజానికి అప్పట్లో 1996లో దాసరి తెరకెక్కించిన కళ్యాణ ప్రాప్తిరస్తు సినిమాలో ఈమె హీరోయిన్‌గా నటించింది కూడా. ఆ తర్వాత సీరియల్స్.. ఆ తర్వాత యాంకరింగ్ వైపు వచ్చింది. ప్రస్తుతం తెలుగులో టాప్ యాంకర్‌గా కొనసాగుతుంది. ఈమె పాత ఫోటోను చూసి అభిమానులు కూడా ఫిదా అయిపోతున్నారు.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Anchor suma, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు