యాంకర్ సమపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారా..?

యాంకర్ సుమ (suma kanakala)

Anchor Suma: యాంకర్ సుమ అంటే తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడేమో..? బుల్లితెరపై ఈమె కనిపిస్తే చాలు రేటింగ్స్ అలా వచ్చేస్తాయంతే. అందుకే 6 నుంచి 60 వరకు ఈమెను అభిమానిస్తుంటారు..

  • Share this:
యాంకర్ సుమ అంటే తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడేమో..? బుల్లితెరపై ఈమె కనిపిస్తే చాలు రేటింగ్స్ అలా వచ్చేస్తాయంతే. అందుకే 6 నుంచి 60 వరకు ఈమెను అభిమానిస్తుంటారు.. వయసుతో సంబంధం లేకుండా సుమతో ప్రేమలో పడిపోతుంటారు అంతా. అంతటి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ యాంకర్‌పై ఇఫ్పుడు లేనిపోని తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని వార్తలొస్తున్నాయి. గతంలో కూడా ఓ సారి ఆ మధ్య ఐటి రైడ్స్ జరక్కపోయినా కూడా జరిగాయని రాసారు. ఇప్పుడు మరోసారి సినిమాల్లోకి రాకపోయినా కూడా వస్తుందనే ప్రచారం జరుగుతుంది. విషయం ఏంటంటే సుమ సినిమాలు చేయడం ఎప్పుడో మానేసింది.
తెలుగు యాంకర్ సుమ కనకాల (Telugu Anchor Suma Kanakala)
తెలుగు యాంకర్ సుమ కనకాల (Telugu Anchor Suma Kanakala)

కొన్నేళ్ల కిందే ఆమె సినిమాలకు దూరమైపోయింది. ఒకప్పుడు కళ్యాణ ప్రాప్తిరస్తు, చాలా బాగుంది, వర్షం, బాద్ షా లాంటి సినిమాల్లో నటించింది సుమ. అయితే బుల్లితెరపై ఉన్న బిజీ కారణమో.. మరే ఇతర కారణమేమైనా ఉందో తెలియదు కానీ అవకాశాలు వచ్చినా కూడా సినిమాల్లో మాత్రం కంటిన్యూ కాలేకపోయింది సుమ. ఇదిలా ఉంటే.. ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప సినిమాలో సుమ నటిస్తుందనే వార్తలు వచ్చాయి. ఎందుకొచ్చాయో.. ఎలా వచ్చాయో తెలియదు కానీ వచ్చిన వెంటనే వైరల్ అయిపోయింది న్యూస్. సుకుమార్ తెరకెక్కిస్తున్న సినిమాలో బన్నీకి అక్క పాత్రలో సుమ నటిస్తుందని ప్రచారం జరిగింది.
యాంకర్ సుమ (suma kanakala)
యాంకర్ సుమ (suma kanakala)

సుమ స్టార్ యాంకర్ కాబట్టి ఈ వార్త వెంటనే వైరల్ అయిపొయింది.కానీ ఈ ప్రచారంలో ఎటువంటి నిజం లేదని.. దర్శకుడు సుకుమార్ సన్నిహిత వర్గాలతో పాటు సుమ కూడా కన్ఫర్మ్ చేసింది. తనకు సినిమాలు చేసే ఉద్ధేశ్యమే లేదని తెగేసి చెప్పినట్లు తెలుస్తుంది. కావాలనే సుమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. లాక్‌డౌన్ కారణంగా ప్రస్తుతం ఇంటికే పరిమితమైన సుమ.. అక్కడ్నుంచి కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తుంది. మిగిలిన యాంకర్స్‌ను కలిపి గేమ్ షోలు రన్ చేస్తుంది. వీడియో కాల్స్ నుంచే కావాల్సినంత కామెడీ జనరేట్ చేస్తుంది సుమ.
Published by:Praveen Kumar Vadla
First published: