Home /News /movies /

TOP ACTRESS SAMANTHA WORK OUTS IN GYM AS SHE TAKES FITNESS CHALLENGE VIDEO GOES VIRAL IN SOCIAL MEDIA SRD

Samantha Video : జిమ్ లో రెచ్చిపోయిన సమంత.. చెమటలు కక్కిస్తోన్న హాట్ బ్యూటీ..

Photo Credit : Instagram

Photo Credit : Instagram

Samantha Video : కథానాయికలకు శరీరాకృతి, అందం, ఆరోగ్యం తప్పనిసరి. వాళ్లు ఏమాత్రం ఒళ్లు చేసినా సినీ అవకాశాలు పోయే అవకాశమూ ఉంటుంది! అందుకే రకరకాల వర్కవుట్స్​ చేస్తూ తమని తాము ఎప్పటికప్పుడు కొత్తగా మలుచుకుంటారు. ఈ లిస్ట్ లో సమంత ముందుంటారు.

ఇంకా చదవండి ...
    టాలీవుడ్ నటి సమంత (Samantha)కు విడాకుల తరువాత క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. పుష్ప ఐటెమ్ సాంగ్‌తో దేశవ్యాప్తంగా హల్‌చల్ చేస్తోంది సమంత . అందంతో పాటు అభినయం కలిగిన సమంతా ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేస్తోంది. పుష్ప (Pushpa) సినిమాలో ఊ అంటావా పాటతో ఉర్రూతలూగించిన సమంతా..అదే పాటతో ఉత్తరాదిని దున్నేస్తోంది. ఉత్తరాది అభిమానుల్లో సమంత క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అంతకుముందు ఫ్యామిలీ మ్యాన్ 2 హిందీ వెబ్‌సిరీస్, తరువాత సామ్ సిరీస్‌తో నటనకు పదునుపెట్టింది. ఇక నుంచి నటకు ప్రాధాన్యత కలిగిన ఛాలెంజింగ్ పాత్రల్ని పోషిస్తానని చెప్పిన సమంత (Samantha)..అందుకు తగ్గ రోల్స్ ఎంపిక చేసుకుంటోంది. ఇక 2022 అంతా ఆమె క్యాలెండర్ ఫుల్ గా ఉంది. సినిమాలు సిరీస్లతో హోరెత్తించనున్నారు. దాని కోసం సమంత అదే స్థాయిలో సమాయత్తం అవుతున్నారు. సహజంగానే సమంత ఫిట్నెస్ ఫ్రీక్. వ్యాయామం ఆమె దినచర్య లో భాగంగా ఉంటుంది.

    అయితే, సమంత ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో పంచుకుంటారు. తాజాగా సమంత జిమ్ లో వర్క్ అవుట్ చేస్తున్న వీడియో షేర్ చేశారు. ఫిట్నెస్ ట్రైనర్ సమక్షంలో సమంత కఠిన కసరత్తులు చేస్తూ.. చెమటలు చిందిస్తుంది. డబ్బులు, ఫేమ్ ఉన్నప్పటికీ కెరీర్ కోసం సమంత ఇలా కష్టపడుతున్నారు. మరి గ్లామర్ ఇండస్ట్రీలో ఫిట్నెస్ చాలా అవసరం. బరువు పెరిగి షేప్ కోల్పోతే దర్శక నిర్మాతలు పక్కనపెట్టేస్తారు.

    ఇది కూడా చదవండి : గోపిచంద్ హీరోయిన్ పై స్టార్ హీరో లైంగిక దాడి.. ఆ దారుణ ఘటనపై భావన రియాక్షన్..

    అందుకే సమంత అంత సన్నగా ఉన్నప్పటికీ వ్యాయామం ఆపడం లేదు. ఇక విడాకుల తర్వాత సమంత కెరీర్ పై మరింత ఫోకస్ పెట్టారు. తాజాగా హాలీవుడ్ మూవీ అరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్‌లో బై సెక్సువల్ పాత్రను ఎంచుకుంది. ఇప్పుడు తాజాగా మరో ఛాలెంజింగ్ పాత్రను పోషిస్తున్నట్టు తెలుస్తోంది. అది కూడా నెగెటివ్ రోల్‌లో. విజయ్ సేతుపతి, నయనతార కలిసి నటిస్తున్న కాత్తువాక్కుల రెండు కాదల్ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న ఖతీజా పాత్రను పోషిస్తోందని సమాచారం.



    విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంతా నటన అద్భుతంగా ఉందని ఇప్పటికే కోలీవుడ్‌లో వార్త హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, నయనతారల ప్రేమకు అడ్డుపడి..విలనిజంతో స్టోరీని మలుపు తిప్పనుందట. ఈ నెగెటివ్ రోల్ పాత్రపై సమంతా అధికారికంగా ఇంకా ధృవీకరించలేదు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Samantha Ruth Prabhu, Tollywood news

    తదుపరి వార్తలు