• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • TOM CRUISES DEEPFAKE TIKTOK VIDEOS GO VIRAL NETIZENS WORRIED FAKE VIDEOS GH TA

Deepfake videos: హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్‌ నకిలీ వీడియోలను తయారు చేసిన వ్యక్తి.. డీప్ ఫేక్ టెక్నాలజీపై నిపుణుల ఆందోళన..

Deepfake videos: హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్‌ నకిలీ వీడియోలను తయారు చేసిన వ్యక్తి.. డీప్ ఫేక్ టెక్నాలజీపై నిపుణుల ఆందోళన..

టామ్ క్రూయిజ్ నకిలీ వీడియోలు (File/Photo)

Deepfake videos: టెక్నాలజీ మిగిల్చే దుష్ప్రభావాల గురించి నిపుణులు ముందు నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • Share this:
Deepfake videos:  టెక్నాలజీ మిగిల్చే దుష్ప్రభావాల గురించి నిపుణులు ముందు నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నకిలీ ఫోటోలు, వీడియోలతో సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఇబ్బందులు పడుతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్‌ను లక్ష్యంగా చేసుకున్నాడు ఒక వ్యక్తి. ఆయన రూపంతో ఉన్న ఫేక్ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బెల్జియం దేశానికి చెందిన క్రిస్ యున్ అనే వీడియో విజువల్ ఎఫెక్ట్స్ స్పెషలిస్ట్‌ ఈ వీడియోలను రూపొందించారు. ముందు వీటిని టిక్‌టాక్‌లో అప్‌లోడ్ చేశారు. అసలు ఆ హీరోకు టిక్‌టాక్‌లో అకౌంట్ లేదని అభిమానులు గుర్తించిన తరువాతే.. ఇవి నిజమైన వీడియోలు కాదని తెలిసింది.

క్రిస్ యున్ @deeptomcruise పేరుతో ఉన్న హ్యాండిల్‌లో ఈ వీడియోలను షేర్ చేశాడు. సరదా కోసమే ఇలా చేసినప్పటికీ, టెక్నాలజీ సాయంతో సెలబ్రిటీలను సులభంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అతడు డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి టామ్ క్రూజ్‌ను పోలి ఉండే మూడు వీడియోలను రూపొందించగలిగారు.


డీప్ ఫేక్ అంటే ఏంటి?
ఒక రకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఉపయోగించి వ్యక్తుల నకిలీ వీడియోను రూపొందించే టెక్నాలజీనే డీప్ ఫేక్ అంటున్నారు. డీప్ ఫేక్ టెక్నాలజీని 2014లో ఇయాన్ గుడ్‌ఫెలో అనే వ్యక్తి అభివృద్ధి చేశారు. ఆయన యాపిల్ కంపెనీలోని మెషిన్ లెర్నింగ్ విభాగం డైరెక్టర్‌గా పనిచేశారు. ఈ టెక్నాలజీపై ఆయన మంచి పట్టు సాధించారు. సంబంధిత వ్యక్తి ఫోటోలు, వీడియోలు, వాయిస్‌ను ఉపయోగించి, అల్గారిథమ్ ద్వారా సూచనలు ఇస్తూ కంప్యూటర్‌లో ఫేక్ వీడియోలు తయారు చేస్తారు. ఆ తర్వాత కంప్యూటర్ ప్రోగ్రామ్ ఆ వ్యక్తి ముఖ కవళికలు, మేనరిజం, వాయిస్‌ను అనుకరించడం ఎలాగో నేర్చుకుంటుంది. ఇలా ఎవరైనా వ్యక్తి రూపంతో నకిలీ వీడియోలను సృష్టించి, వారే మాట్లాడుతున్నట్టుగా ఫేక్ వీడియోలను రూపొందిస్తారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న టామ్ క్రూజ్ ఫేక్ వీడియోను కూడా ఇలాగే తయారు చేశారు.

వీడియోల్లో ఏముంది?
టామ్ క్రూజ్ గోల్ఫ్ ఆడుతున్నట్లు, మ్యాజిక్ చేస్తున్నట్లు, ఒక తరగతి గదిలో మాట్లాడుతున్నట్లు మూడు నకిలీ వీడియోలు ఉన్నాయి. వీటిని చూసేవారందరూ నిజంగానే టామ్ క్రూజ్ ఈ వీడియోలు తీసుకున్నారేమో అనుకున్నారు. ఆ తరువాత డీప్ ఫేక్ అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. టిక్‌టాక్‌లో ఈ మూడు వీడియో క్లిప్పింగ్‌లను మంగళవారం నాటిని 11 మిలియన్ల మంది చూశారు. ఈ సాంకేతికత సాయంతో వ్యక్తుల హోదాను తగ్గించే నకిలీ వీడియోలు సులభంగా తయారు చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై క్రూజ్ అభిమానులు సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ట్విట్టర్‌లో ఈ వీడియోను లక్షల మంది చూశారు. "డీప్ ఫేక్ టెక్నాలజీ అనేది అత్యంత ఆందోళన కలిగించే విషయాలలో ఒకటి. దీన్ని అడ్డుకోవడానికి వివిధ దేశాలు చట్టాలు చేయాలి" అని ఒక వ్యక్తి వీడియోకు కామెంట్ పెట్టారు. ఈ టెక్నాలజీ సాయంతో నకిలీ సమాచారాన్ని, ఫేక్ వార్తలను వ్యాపింపజేయకుండా అడ్డుకోవాలి అని మరో వ్యక్తి కామెంట్ రాశారు. సాధారణ ప్రజలను సులభంగా మోసం చేయగల ఇలాంటి టెక్నాలజీని బ్యాన్ చేయాలని మరో యూజర్ కామెంట్ పెట్టారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:

అగ్ర కథనాలు