Home /News /movies /

TOM CRUISE TOP GUN MAVERICK SEQUEL COMING AFTER 36 YEARS SB

హిట్ సినిమాకు 36 ఏళ్ల తర్వాత సీక్వెల్‌.. బడ్జెట్‌ రూ. 12 వందల కోట్లు

టామ్ క్రూజ్ టాప్ గాన్ సీక్వెల్

టామ్ క్రూజ్ టాప్ గాన్ సీక్వెల్

 1986లో వచ్చిన ఈ చిత్రం టామ్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. సుమారు 36 ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌గా 'టాప్‌ గన్‌: మేవరిక్‌' రానుంది.

    ఓ సినిమాకు సీక్వెల్ తీయాలంటే.. ఒకటి లేదా రెండేళ్లు.. మూడేళ్లు పడుతుంది. మహా అయితే ఐదేళ్లు కాని.. ఓ హిట్ మూవీకి ఇప్పుడు అక్షరాల 36 ఏళ్ల తర్వాత  సీక్వెల్ వస్తోంది. హాలీవుడ్‌ ప్రముఖ యాక్షన్‌ హీరో టామ్‌ క్రూజ్‌ కెరీర్‌లో హిట్‌ సాధించిన సినిమాల్లో 'టాప్‌ గన్‌' ఒకటి. 1986లో వచ్చిన ఈ చిత్రం టామ్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. సుమారు 36 ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌గా 'టాప్‌ గన్‌: మేవరిక్‌' రానుంది.

    తాజాగా ఈ సినిమా ప్రీమియర్‌ను ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 2022లో ప్రదర్శించారు. 36 ఏళ్ల తర్వాత 'టాప్‌ గన్‌'కు సీక్వెల్‌గా రావడం, కేన్స్‌ ఫెస్టివల్‌లో ప్రీమియర్‌ వేయడంతో ఈ చిత్రంపై భారీ హైప్‌ ఏర్పడింది. ఈ మూవీని మే 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ మూవీని రూ. 12 వందల కోట్ల బడ్జెట్‌తో జోసెఫ్‌ కోసిన్స్కీ తెరకెక్కించారు.

    క్రిస్టోఫర్‌ మెక్ క్వారీ రచనా సహకారం అందించారు.  మరోవైపు 1996లో వచ్చిన 'మిషన్‌ ఇంపాజిబుల్‌' సిరీస్‌ను సుమారు 25 ఏళ్లుగా తెరకెక్కిస్తూ వస్తున్నారు. ఈసినిమా సిరీస్‌తో టామ్ క్రూజ్‌ విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకున్నాడు. కెరీర్‌లో మంచి హిట్‌ ఇచ్చిన టాప్‌ గన్‌ సీక్వెల్‌కు మాత్రం 36 ఏళ్లు పట్టింది. అయితే ఈ సీక్వెల్‌ను మూడేళ్ల క్రితమే స్టార్ట్‌ చేసిన కరోనా వల్ల చాలా ఆలస్యమైంది.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Hollywood, Hollywood News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు