మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) పాలకవర్గం ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఫిలిం ఛాంబర్‌లో జరుగుతోన్న ఈ పోలింగ్ మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనుంది. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. ఈసారి ఎన్నికల్లో సీనియర్ నటుడు, ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా మరోసారి పోటీ చేస్తుండగా, ఆయనకు ప్రత్యర్థిగా నటుడు నరేష్ బరిలో ఉన్నారు. రాత్రి 8 గంటలకు ఫలితాలు వెలువడనున్నాయి. మా అసోషియేషన్‌లో దాదాపు 800 మంది సభ్యులు ఉండగా, వీరంతా ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
శివాజీ రాజా ప్యానెల్‌లో ఎస్వీ కృష్ణారెడ్డి, శ్రీకాంత్, రాజీవ్ కనకాలు, నాగివీడు ఉన్నారు. నరేష్ ప్యానెల్లో జీవిత, రాజశేఖర్, శివబాలజీ సహా 26 మంది ఉన్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు తరలివచ్చి పోలింగ్‌లో పాల్గొన్నారు. గత ఎన్నికల్లో అధ్యక్ష కార్యదర్శులుగా చేసిన శివాజీరాజా, నరేష్‌లు ప్రస్తుతు ప్రత్యర్థులుగా మారి అధ్యక్ష పదవికి పోటీపడుతున్నారు. దీంతో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పించుకుంటున్నారు.