Jr NTR - Kalyan Krishna: ‘సోగ్గాడే చిన్నినాయనా’ దర్శకుడితో జూనియర్ ఎన్టీఆర్.. ఇదిగో కన్ఫర్మేషన్..!

ఎవరు మీలో కోటీశ్వరులు (Jr NTR)

Jr NTR - Kalyan Krishna: అరవింద సమేత (Aravinda Sametha) సినిమా తర్వాత ఇప్పటి వరకు మళ్లీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెండితెరపై కనిపించలేదు. చాలా రోజుల తర్వాత బుల్లితెరపై కనిపించబోతున్నాడు తారక్(Jr NTR). ఈయన హోస్ట్ చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో త్వరలోనే జెమినీలో ప్రసారం కానుంది.

  • Share this:
అరవింద సమేత సినిమా తర్వాత ఇప్పటి వరకు మళ్లీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెండితెరపై కనిపించలేదు. ట్రిపుల్ ఆర్ సినిమాతో బిజీగా ఉండటంతో జూనియర్ మరో సినిమా చేయడానికి వీలు పడలేదు. చాలా రోజుల తర్వాత ఇప్పుడు వెండితెరపై కాదు కానీ బుల్లితెరపై కనిపించబోతున్నాడు తారక్. ఈయన హోస్ట్ చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో త్వరలోనే జెమినీలో ప్రసారం కానుంది. ఆగస్ట్ 15న స్వంతంత్య్ర దినోత్సవ కానుకగా తొలి ఎపిసోడ్ ఎయిర్ కానుందని ప్రచారం జరుగుతుంది. భారీ స్థాయిలోనే ఈ షో ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం జూనియర్ ఎన్టీఆర్ దాదాపు 12 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈయన సోగ్గాడే చిన్ననాయనా దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో పని చేస్తున్నాడు. అయితే అది సినిమా కోసం మాత్రం కాదు.

ఎవరు మీలో కోటీశ్వరులు షో కోసం.. దీనికి ఆయన ప్రోమోలు డైరెక్ట్ చేస్తున్నాడు. నిజానికి త్రివిక్రమ్ ఈ షో ప్రోమోస్ డైరెక్ట్ చేయాలనుకున్నా కూడా అనుకోని కారణాలతో ఒక ప్రోమో మాత్రమే ఆయన తెరకెక్కించాడు. అయితే ఈ షో కోసం మరో 5 ప్రోమోలు కూడా డిజైన్ చేసారు మేకర్స్. వీటిని కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన ఈయన.. నాగ చైతన్య ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాతో రెండో విజయం అందుకున్నాడు.
jr ntr,jr ntr twitter,jr ntr evaru meelo koteeswarulu show,jr ntr evaru meelo koteeswarulu show promos,jr ntr evaru meelo koteeswarulu show 1st episode,telugu cinema,jr ntr evaru meelo koteeswarulu promo directed by Kalyan Krishna,జూనియర్ ఎన్టీఆర్,జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ కృష్ణ,కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోమో,జూనియర్ ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులులో రామ్ చరణ్
ఎన్టీఆర్ కళ్యాణ్ కృష్ణ (jr ntr kalyan krishna)

మూడో సినిమాగా రవితేజతో చేసిన నేల టిక్కెట్టు మాత్రం అంచనాలు అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఇప్పుడు నాగార్జున-నాగచైతన్య హీరోలుగా ‘బంగార్రాజు’ సినిమాను రూపొందించనున్నాడు కళ్యాణ్ కృష్ణ. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకి సంబంధించిన అన్ని ప్రోమోలను డిజైన్ చేశారు. ఆగస్టు 15లోపే 5 ప్రోమోలు కూడా ఒకదాని తర్వాత ఒకటి విడుదల కానున్నాయి. త్రివిక్రమ్ దూరంగానే ఉన్నా.. తన సలహాలను కళ్యాణ్ కృష్ణకు ఇచ్చినట్లు తెలుస్తుంది.
Published by:Praveen Kumar Vadla
First published: