• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • TOLLYWOOD YOUNG TIGER JR NTR REACHED A WORST RECORD IN HIS CAREER DUE TO SS RAJAMOULI PK

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లో చెత్త రికార్డు.. అంతా రాజమౌళి వల్లే అంటున్న ఫ్యాన్స్..

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లో చెత్త రికార్డు.. అంతా రాజమౌళి వల్లే అంటున్న ఫ్యాన్స్..

ఎన్టీఆర్ (Twitter/Photo)

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) కెరీర్ మొదలు పెట్టి దాదాపు 20 ఏళ్లవుతుంది. ఇన్నేళ్ల కెరీర్‌లో ఎన్నో సంచలనాలు సృష్టించాడు జూనియర్. అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కోసం ఓ చెత్త రికార్డు వేచి చూస్తుంది. అది చూసి అంతా రాజమౌళి(Rajamouli) వల్లే అంటూ తిట్టుకుంటున్నారు ఫ్యాన్స్.

  • Share this:
జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ మొదలు పెట్టి దాదాపు 20 ఏళ్లవుతుంది. ఇన్నేళ్ల కెరీర్‌లో ఎన్నో సంచలనాలు సృష్టించాడు జూనియర్. తెలుగు స్టార్ హీరోల్లో ఒకడిగా నిలిచాడు. ఇప్పుడు రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కోసం ఓ చెత్త రికార్డు వేచి చూస్తుంది. కెరీర్ మొదలు పెట్టిన తర్వాత ఇప్పటి వరకు ఇన్నేళ్లు గ్యాప్ ఎప్పుడూ తీసుకోలేదు తారక్. కేవలం 2009లో మాత్రమే ఓ కాలెండర్ ఇయర్ మిస్ చేసాడు. అప్పుడు కూడా ఆయన రాజకీయాల్లో ప్రచారం చేసాడు.. వెంటనే యాక్సిడెంట్ అయింది. దాంతో 2009లోనే రావాల్సిన అదుర్స్ కాస్తా 2010 సంక్రాంతికి విడుదలైంది. దాంతో 2009 కూడా కావాలని తీసుకున్న బ్రేక్ కాదు. కానీ ఇప్పుడు మాత్రం తారక్ కెరీర్‌లో తొలిసారి మూడేళ్లు ఖాళీగా ఉండేలా కనిపిస్తుంది. రాజమౌళి కోసం రెండు కాలెండర్ ఇయర్స్ వదిలేసాడు జూనియర్. 2018లో అరవింద సమేత సినిమాతో వచ్చిన ఎన్టీఆర్.. 2019 ఖాళీగా వదిలేసాడు. అలాగే 2020లోనూ ఏ సినిమా రాలేదు. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే 2021 కూడా వదిలేసేలా కనిపిస్తున్నాడు.

ఎందుకంటే కరోనా కారణంగా ట్రిపుల్ ఆర్ షూటింగ్ అనుకున్న దానికంటే నెమ్మదిగానే జరుగుతుంది. దాంతో అక్టోబర్ 13కి కూడా సినిమా రావడం కష్టంగానే కనిపిస్తుంది. ఈ సినిమాను 2022 సంక్రాంతికి విడుదల చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు.
జూనియర్ ఎన్టీఆర్ (jr ntr TDP)
జూనియర్ ఎన్టీఆర్ (jr ntr TDP)


దాంతో ఫస్ట్ టైమ్ 2019, 2020 ఖాళీగా ఉండిపోయాయి. ఇప్పుడు 2021 కూడా ఖాళీగానే మిగిలిపోయేలా కనిపిస్తుంది. ఇదే జరిగితే 2018 నుంచి 2022 వరకు సినిమాలేవీ చేయనట్లే. గతంలో 2007 నుంచి 2010 వరకు మహేష్ బాబు లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. మొన్న పవన్ 2018 నుంచి 2021 వరకు గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఇదే చేయబోతున్నాడు. ఇప్పుడు వచ్చిన గ్యాప్‌ను వరస సినిమాలతో పూర్తి చేయాలని చూస్తున్నాడు జూనియర్.
జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి (jr ntr rajamouli)
జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి (jr ntr rajamouli)


మరోవైపు రామ్ చరణ్ కూడా 2019 సంక్రాంతికి వినయ విధేయ రామతో వచ్చాడు.. మళ్లీ 2020 ఖాళీ. ఇప్పుడు 2021 కూడా ఖాళీనే. అంటే ఆయన కూడా దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకున్నట్లే. ఎంతైనా రాజమౌళితో సినిమా అంటే ఆ మాత్రం ఉంటుంది మరి.
Published by:Praveen Kumar Vadla
First published:

అగ్ర కథనాలు