JR NTR: ఎన్టీఆర్ మల్టీస్టారర్.. ఆర్ఆర్ఆర్ మించి ఉంటుందా?

JR NTR: సినిమాలలో ఒక హీరో కాకుండా మరో హీరో కాంబినేషన్ లో ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. ఇప్పటివరకు ఇద్దరు హీరోలతో సినిమాలు తెరకెక్కగా మంచి సక్సెస్ ను అందుకున్నాయి.

JR NTR: సినిమాలలో ఒక హీరో కాకుండా మరో హీరో కాంబినేషన్ లో ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. ఇప్పటివరకు ఇద్దరు హీరోలతో సినిమాలు తెరకెక్కగా మంచి సక్సెస్ ను అందుకున్నాయి.

  • Share this:
    JR NTR: సినిమాలలో ఒక హీరో కాకుండా మరో హీరో కాంబినేషన్ లో ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. ఇప్పటివరకు ఇద్దరు హీరోలతో సినిమాలు తెరకెక్కగా మంచి సక్సెస్ ను అందుకున్నాయి. అదే ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఓకే సినిమాలో చేస్తే ఇక ఆ సినిమా హిట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరమే లేదు. ఎందుకంటే ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తే ఆ సినిమా అనేది అంత క్రేజ్ ను సంపాదించుకుంటుంది

    ఇదిలా ఉంటే రాజమౌళి దర్శకత్వంలో ఇద్దరు స్టార్ హీరోల కాంబినేషన్ లో ఆర్ఆర్ఆర్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తుండగా ఈ సినిమా కోసం ఇది ఇరువురి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్ వరుస ఆఫర్లు అందుకుంటున్నాడు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ చేయనున్న మరో సినిమాలో మరో స్టార్ హీరో నటించినున్నట్లు తెలుస్తుంది. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో కాదు..

    కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్. విజయ్ తో కలిసి ఎన్ టి ఆర్ మరో భారీ మల్టీస్టారర్ ను చేయనున్నాడు. ఇక ఈ సినిమా కు అట్లీ దర్శకత్వం వహించనున్నట్లు తెగ వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఈ డైరెక్టర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయనున్నట్లు తెలపగా.. అది ఈ సినిమానేనని అభిమానులు ఫిక్స్ అయ్యారు. అంతే కాకుండా ఈ సినిమా పాన్ ఇండియా మూవీ గా రూపొందనుందని సమాచారం. ఇక మొత్తానికి వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా వచ్చినట్లయితే ఫ్యాన్స్ కు పెద్ద పండుగ అని చెప్పవచ్చు.

    ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. అంతేకాకుండా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ మరో సినిమా చేయనున్నాడు.
    Published by:Navya Reddy
    First published: