Home /News /movies /

TOLLYWOOD YOUNG TIGER JR NTR INJURED MANY TIMES WHILE FILMS ARE IN SHOOTING NR

Jr NTR: ఎవరి సపోర్టు లేదు.. ఎన్నోసార్లు ఎదురుదెబ్బలు.. కానీ ఎక్కడ తగ్గకుండా ఇప్పుడు ఈ స్థానంలో ఉన్న ఎన్టీఆర్?

Juniour NTR

Juniour NTR

Jr NTR: సినిమా షూటింగులో సాహసాలు చేసినప్పుడు ఏ నటులకైనా దెబ్బలు తగలడం సర్వసాధారణం. ఇలా ఎంతో మంది నటులకు షూటింగ్ సమయంలో చాలా దెబ్బలు తగులుతుంటాయ్.

    Jr NTR: సినిమా షూటింగులో సాహసాలు చేసినప్పుడు ఏ నటులకైనా దెబ్బలు తగలడం సర్వసాధారణం. ఇలా ఎంతో మంది నటులకు షూటింగ్ సమయంలో చాలా దెబ్బలు తగులుతుంటాయ్. ముఖ్యంగా ఫైట్స్ చేసిన సమయంలో చాలామందికి ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇక ఎన్టీఆర్ కు కూడా ఇలాంటి ప్రమాదం జరిగింది. కానీ ఒక్కసారి కాదు ఎన్నోసార్లు ఎన్టీఆర్ ప్రమాదానికి గురయ్యారు. కొన్నిసార్లు జరిగిన ప్రమాదాలు చిన్నవి అయితే మరికొన్నిసార్లు పెద్ద పెద్ద ప్రమాదాలు. కానీ అన్ని తట్టుకున్నాడు. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్ కు హీరోగా ఎదిగాడు ఎన్టీఆర్.

    కెరీరి ప్రారంభం సమయంలో ఎన్టీఆర్ మనవడు అని తప్ప సినీ పెద్దల నుంచి ఎటువంటి సపోర్ట్ లేదని ఇప్పటికి ఇండస్ట్రీలో సినీ క్రిటిక్స్ చెప్తూనే ఉంటారు.. సినిమా సినిమాకు తాతను తలిపిస్తూ నటించాడు. డ్యాన్స్ తో ఎంతోమంది మాస్ అభిమానులను సంపాదించాడు. ఇక అలాంటి ఈ ఎన్టీఆర్ సినిమా షూటింగ్ లో గాయాల పాలవుతూనే ఉన్నాడు. కొన్నిసార్లు సినిమా షూటింగ్ లో జరిగితే కొన్ని సార్లు సినిమా పూర్తయిన తర్వాత గాయాల పాలయ్యాడు ఎన్టీఆర్. ఆలా ఎన్ని సార్లు జరిగింది.. ఏ సినిమాల సమయంలో జరిగిందనేది చూద్దాం..

    ntr student no.1
    ntr student no.1


    రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ''స్టూడెంట్ నెంబర్ 1'' సినిమా మంచి సక్సెస్ అందుకుంది. అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఎన్టీఆర్ గాయపడటం వల్ల ఈ సినిమా షూటింగ్ కాస్త ఆలస్యం అయిందట. కానీ ఈ సినిమా అప్పట్లో మంచి సక్సెస్ అందుకుంది.

    NTR Aadi
    NTR Aadi


    ఆతర్వాత వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆది సినిమాలో కూడా కొన్ని ఫైట్ సన్నివేశాల సమయంలో ఎన్టీఆర్ చేతికి గాయమైందట. చేతికి కట్టు ఉండగానే ఓ సాంగ్ లో కూడా పాల్గొన్నాడట ఎన్టీఆర్. ఇక ఈ సినిమా అప్పట్లో సంచలన సక్సెస్ అయ్యింది.



    ఇక సింహాద్రి సినిమా సమయంలో ఎంతో గాయం అయినా కూడా పట్టించుకోకుండా మళ్లీ షూటింగ్ లో అడుగు పెట్టాడట ఎన్టీఆర్. ఇక ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.



    ఆతర్వాత సాంబ, ఊసరవెల్లి సినిమాలలో కూడా కొన్ని సన్నివేశాల సమయంలో గాయపడ్డాడు. అయినప్పటికీ ఈ సినిమాలకు ఆ సెంటిమెంట్ ఏం వర్కౌట్ అవ్వలేదు.



    ఇక అదుర్స్ సినిమా షూటింగ్ తర్వాత ఎన్నికల ప్రచారం కోసం వెళ్తున్న ఎన్టీఆర్ కారుకు పెద్ద ప్రమాదం జరిగింది. ఇక ఆ సమయంలో ఎన్టీఆర్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.



    ప్రస్తుతం నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో కూడా ఓ గాయం జరిగింది. ఈ సినిమాకు కూడా గాయం సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని.. సక్సెస్ అని ఎన్టీఆర్ ఖాతాలో వేసేశారు.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Aadi, Jr ntr, Oosaravelli, RRR, Simhadri, Student no.1, Tollywood

    తదుపరి వార్తలు