Jr NTR Classical dance: జూనియర్ ఎన్టీఆర్ క్లాసికల్ డాన్స్.. చిన్నప్పటి వీడియో ఎంత ముచ్చటగా ఉందో..?

జూనియర్ ఎన్టీఆర్ క్లాసికల్ డాన్స్ (Jr NTR Dance)

Jr NTR Classical dance: జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) మంచి నటుడు మాత్రమే కాదు అద్భుతమైన డాన్సర్ కూడా. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ డాన్సర్స్‌లో ఎన్టీఆర్ కూడా ఒకడు అంటే అతిశయోక్తి కాదు. స్వయంగా హృతిక్ రోషన్ కూడా ఓ టైమ్‌లో జూనియర్ డాన్స్ గురించి ప్రస్తావించారు.

  • Share this:
జూనియర్ ఎన్టీఆర్ మంచి నటుడు మాత్రమే కాదు అద్భుతమైన డాన్సర్ కూడా. అందులోనూ భరతనాట్యంలో ఈయనకు ప్రవేశం ఉంది. చిన్నప్పటి నుంచే క్లాసికల్ డాన్స్‌లో శిక్షణ తీసుకున్నారు జూనియర్. అందుకే ఇప్పుడు డాన్సులు కుమ్మేస్తున్నారు. టాలీవుడ్‌లోనే కాదు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ డాన్సర్స్‌లో ఎన్టీఆర్ కూడా ఒకడు అంటే అతిశయోక్తి కాదు. స్వయంగా హృతిక్ రోషన్ కూడా ఓ టైమ్‌లో జూనియర్ డాన్స్ గురించి ప్రస్తావించారు. చిన్ననాటి నుంచి కూడా డాన్స్ అంటే ఉన్న ఆసక్తిని గమనించి తల్లి శాలిని కొడుకుకు డాన్స్ ట్రైనింగ్ ఇప్పించారు. అలా చిన్నపుడే ప్రదర్శనలు కూడా ఇచ్చారు ఈయన. అప్పుడే బహుమతులు కూడా గెలుచుకున్నారు. ఎన్టీఆర్ స్కూల్ ఏజ్‌లో ఉన్నపుడు ఇచ్చిన డాన్స్ పర్ఫార్మెన్స్ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అప్పట్లో నందమూరి చిన్నోడు చేసిన ఈ నాట్యానికి గిప్టులు కూడా బాగానే వచ్చాయి. అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ వీడియోలతో పాటు ఫోటోలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చేది.

బాల రామాయణం సినిమా చేసిన తర్వాత కూడా ఈయన చాలా ప్రదర్శనలు ఇచ్చారు. అప్పట్లో అలా ఎన్టీఆర్ ఇచ్చిన ప్రదర్శనల్లో ఒక్కటి ఇప్పుడు వైరల్ అవుతుంది. (Video Credit: Mana Stars)



క్లాసికల్ డాన్స్‌లో తన మెళుకువలు చూపించారు జూనియర్ ఎన్టీఆర్. తొలి సినిమా బాల రామాయణం కంటే ముందు ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు జూనియర్. ఆ తర్వాత బాల రామాయణం.. ఆ తర్వాత మూడుళ్లకు నిన్ను చూడాలని సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు ఈయన. ఆ వెంటనే ఆది, సింహాద్రితో సూపర్ స్టార్ అయిపోయారు. ప్రస్తుతం రాజమౌళి ట్రిపుల్ ఆర్‌తో పాటు కొరటాల శివ సినిమాలతో బిజీగా ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్.
Published by:Praveen Kumar Vadla
First published: