హోమ్ /వార్తలు /సినిమా /

Prabhas: ప్రభాస్ 'ఫ్యాన్స్'కు షాకింగ్ న్యూస్.. గుండెలు బద్దలయ్యే వార్త!

Prabhas: ప్రభాస్ 'ఫ్యాన్స్'కు షాకింగ్ న్యూస్.. గుండెలు బద్దలయ్యే వార్త!

ప్రభాస్ (Twitter/Photo)

ప్రభాస్ (Twitter/Photo)

Prabhas: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఎంత బిజీగా ఉన్నారో చెప్పాల్సిన పని లేదు. ఎక్కువ సమయం తీసుకోకుండా అభిమానులకు దగ్గరగా ఉండేందుకు ప్రభాస్ ఎంత ప్రయత్నించిన అయన సినిమాలు లెట్ అవుతున్నాయ్.

  Prabhas: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఎంత బిజీగా ఉన్నారో చెప్పాల్సిన పని లేదు. ఎక్కువ సమయం తీసుకోకుండా అభిమానులకు దగ్గరగా ఉండేందుకు ప్రభాస్ ఎంత ప్రయత్నించిన అయన సినిమాలు లెట్ అవుతున్నాయ్. కారణం ఏదైన ప్రభాస్ సినిమా విడుదల అవ్వడానికి మాత్రం చాలా సమయం పడుతుంది. ఇక అలానే ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన పీరియాడికల్‌ లవ్‌స్టోరీ రాధేశ్యామ్‌ విడుదల వాయిదా పడేలా ఉంది.

  ఇందుకు కారణం రాధేశ్యామ్ సినిమాలో కొన్ని సీన్ లు ప్రభాస్ కు నచ్చకపోవడమే. కొన్ని సన్నివేశాలపై ప్రభాస్ అసంతృప్తిని వ్యక్తం చేసారని.. ఆ సన్నివేశాలకు కొన్ని ఇంప్రూవ్ మెంట్స్ అవసరం అని ప్రభాస్ సినిమా దర్శకుడు రాధాకృష్ణకు చెప్పినట్టు సమాచారం. అందుకే రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ ఏ సీన్స్ పై అయితే అసంతృప్తితో ఉన్నదో ఆ సీన్స్ ను మళ్ళీ తెరకెక్కించే ఆలోచనలో ఉందట చిత్రబృందం.

  అయితే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో ఉండడటంతో.. ఈ కరోనా సెకండ్ వేవ్ ప్రభావం కాస్త తగ్గగానే ఈ సన్నివేశాలను మరల చిత్రీకరించేందుకు రాధాకృష్ణ సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. కాగా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా జూలై 30న విడుదల కానున్నట్టు ఇదివరకే చిత్ర బృందం ప్రకటించగా ఇప్పుడు రీ షూట్ వల్ల సినిమా లేట్ అయ్యి వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు సమాచారం.

  Published by:Navya Reddy
  First published:

  Tags: Pooja Hegde, Prabhas, Radhe Shyam, Tollywood

  ఉత్తమ కథలు