• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • TOLLYWOOD YOUNG HERO SUNDEEP KISHAN HELPING TO ORPANS IN THIS COVID 19 PANDEMIC NR

Sundeep Kishan: సందీప్ కిషన్ గొప్ప మనసు.. అనాధలకు అండగా టాలీవుడ్ యంగ్ హీరో!

sundeep kishan

Sundeep Kishan: ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఎంతలా చుట్టుముట్టిందో.. అందరికీ తెలిసిందే. ఎంతోమంది ఈ వైరస్ కు బలి అవుతున్నారు.

  • Share this:
    Sundeep Kishan: ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఎంతలా చుట్టుముట్టిందో.. అందరికీ తెలిసిందే. ఎంతోమంది ఈ వైరస్ కు బలి అవుతున్నారు. రోజురోజుకు కేసులు లక్షల సంఖ్యలో పెరుగుతున్న తరుణంలో.. ఎవరు ఏమి చేయలేని పరిస్థితిలో ఉంది మన దేశం. హాస్పిటల్లో సరైన వైద్య సదుపాయాలు లేక, ఆక్సిజన్ సరిపోక ఎంతోమంది చిన్న, పెద్ద, ముసలి అని తేడా లేకుండా ప్రాణాలు వదులుతున్నారు.

    ఇప్పటికే సినీ ఇండస్ట్రీ నుండి ఎంతోమంది సెలబ్రెటీలు.. సోనూసూద్ లా కదిలి వస్తున్నారు.. సోనూసూద్ చేసిన సహాయం గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటిది ఇప్పుడు కూడా ఆయన ముందడుగు వేస్తున్నాడు. ఇక ఈయనే వలే ఎంతో మంది సెలబ్రెటీలు తమ వంతు సహాయానికి ముందుకు వచ్చారు. ఎలాగైనా ఆక్సిజన్ ని అందించాలంటూ.. తమ వంతు సహాయం చేయడమే కాకుండా.. ఇటీవలే ఓ యంగ్ హీరో ఆక్సిజన్ కోసం తన కిష్టమైన బైక్ ను కూడా అమ్మిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా మరో యంగ్ హీరో ఏకంగా చిన్నారుల బాధ్యతని తీసుకోనున్నారు.

    ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు.. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్. తాజాగా ఈయన ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూసి ముందుకు వచ్చాడు. ఇప్పటికే దేశంలో ఎంతోమంది ప్రాణాలు విడుస్తున్న తరుణంలో.. తమ కుటుంబ సభ్యులు దిక్కు లేని వాళ్ళు అవుతున్నారు. ఇక చిన్న పిల్లలు కూడా వాళ్ల తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిపోతున్నారు.

    ఇక సందీప్ కిషన్ వారి బాధ్యతను తానే తీసుకుంటానంటూ.. రెండేళ్ల పాటు వారికి కావాల్సిన తిండి, చదువు, ఇతర అవసరాలన్నింటిని తానే చూసుకుంటానని తెలిపాడు. ఇక అలాంటివారు ఎవరైనా ఉంటే వెంటనే తనకు కాంటాక్ట్ చేయాలని.. తన ఈమెయిల్ ఐడీ కూడా పోస్ట్ చేశాడు. అనాథలుగా మారిన పిల్లల వివరాలను..sundeepkishancovidhelp@gamil.com కు అందించాలని తన ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేశాడు.
    Published by:Navya Reddy
    First published: