మరో మెగా హీరో పెళ్లి ఫిక్స్.. ముహూర్తం అప్పుడే.. అమ్మాయి ఎవరంటే..

మెగా ఫ్యామిలీ హీరోలు (ఫైల్ ఫోటో)

Sai Dharam Tej: ప్రస్తుతం ముహూర్తాలు లేనందున.. మంచి రోజులు వచ్చిన వెంటనే కుర్ర హీరో సాయిధరమ్ తేజ్ పెళ్లి చేసుకుంటాడని మెగా కాంపౌండ్ నుంచి వినిపిస్తున్న టాక్.

 • Share this:
  నిహారిక పెళ్లి తరువాత మెగా ఫ్యామిలీలో నెక్ట్స్ పెళ్లి ఎవరిదనే అంశంపై చాలాకాలంగా చర్చ జరుగుతోంది. ఇందుకు అసలు కారణం ఆ ఫ్యామిలీలో ముగ్గురు బ్యాచిలర్స్ పెళ్లికి రెడీగా ఉండటమే. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్, యంగ్ హీరో సాయిధరమ్ తేజ్‌తో పాటు అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ పెళ్లికి రెడీగా ఉన్నారు. దీంతో వీరిలో ఎవరు ముందుగా పెళ్లి చేసుకుంటారా ? అని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మెగా ఫ్యామిలీ తదుపరి పెళ్లి వేడుక ఎవరిదనే దానిపై రీసెంట్‌గా క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. చిరంజీవి చెల్లెలి కుమారుడు, టాలీవుడ్ యంగ్ హీరో సాయిధరమ్ తేజ్.. ఈ ఏడాది పెళ్లి చేసుకోవడం దాదాపు ఖాయమైందనే ప్రచారం జరుగుతోంది.

  నిహారిక పెళ్లి తరువాత తన పెళ్లిపై కుటుంబ సభ్యులు ఒత్తిడి తెస్తున్నట్లు సాయిధరమ్ తేజ్ రీసెంట్‌గా కామెంట్ చేశారు. అయితే పెళ్లికి ఓకే చెప్పిన తరువాతే ఈ కుర్ర హీరో ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. ఇక మేనల్లుడి పెళ్లి బాధ్యతలను మెగాస్టార్ చిరంజీవి తీసుకున్నారని తెలుస్తోంది. చిరంజీవి తన చెల్లితో కలిసి అమ్మాయిని కూడా సెలక్ట్ చేశారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. సినీ ఇండస్ట్రీతో సంబంధం లేని కుటుంబం నుంచి అమ్మాయిని సాయిధరమ్ తేజ్ కోసం ఎంపిక చేశారని సమాచారం. పెద్దలు ఓకే చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు సాయిధరమ్ తేజ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.

  ప్రస్తుతం ముహూర్తాలు లేనందున.. మంచి రోజులు వచ్చిన వెంటనే ఈ కుర్ర హీరో పెళ్లి చేసుకుంటాడని మెగా కాంపౌండ్ నుంచి వినిపిస్తున్న టాక్. మరోవైపు తన పెళ్లి గురించి సాయిధరమ్ తేజ్ అఫీషియల్‌గా ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇక మెగా ఫ్యామిలీ నుంచి హీరోల్లో సాయిధరమ్ తేజ్ కూడా సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ రెండు మూడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.
  Published by:Kishore Akkaladevi
  First published: