టాలీవుడ్ (Tollywood)ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఈ వారంలోఇద్దరు దిగ్గజాలు మనల్ని విడిచి వెళ్లిపోయారు. నంబరు 28న ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ (Shivshankar master కరోనాతో కన్నుమూశారు. ఆ తర్వాత రెండు రోజులకే ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Sitaramasastri) ఊపిరితిత్తుల క్యాన్సర్తో మరణించారు. ఈ ప్రముఖు మృతి నుంచి టాలీవుడ్ ఇంకా తేరుకోకముందే.. మరో యువ హీరో ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. రాజావారు రాణివారు సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమై ఎస్ఆర్ కల్యాణమండపం మూవీతో మంచి విజయాన్ని అందుకున్న కిరణ్ అబ్బవరం (Kiran Abbavram) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కిరణ్ సోదరుడు రామాంజులు రెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. బుధవారం ఉదయం కడప జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అతడు చనిపోయాడు.
Balakrishna Remakes: నందమూరి బాలకృష్ణ తన ఫిల్మీ కెరీర్లో ఇన్ని రీమేక్
కిరణ్ సోదరుడు రామాంజులురెడ్డి కడప జిల్లా సంబేపల్లి మండలం దుద్యాల గ్రామంలో నివసిస్తుంటారు. బుధవారం ఉదయం కారులో ప్రయాణిస్తుండగా కడప జిల్లా చెన్నూరు వద్ద ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రామాంజనేయులు రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. ఐతే ప్రమాదం ఎలా జరిగింది? అనే వివరాలు తెలియాల్సి ఉంది.
Sirivennala Seetharama Sastry : సిరివెన్నెల సీతారామశాస్త్రి చనిపోవడానికి అసలు కారణం అదేనా.
కిరణ్ అబ్బరం తాను చేసిన రెండు సినిమాలతోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. రాజావారు రాణివారు చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కిరణ్.. ‘ఎస్ఆర్ కల్యాణమండపం'తో హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వరుస ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం సమ్మతమే', ‘సెబాస్టియన్ పీసీ 524' అనే చిత్రాల్లో నటిస్తున్నాడు. రెండు రోజుల క్రితం మరో సినిమాను కూడా ప్రారంభించాడు. రమేష్ కదూరి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నవంబరు 29న పూజా కార్యక్రమాలతో ప్రారంభమయింది. ఇలా ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వస్తున్న సమయంలోనే తన సోదరుడిని కోల్పోవడం చాలా బాధాకరమని.. ఆయనకు పెద్ద కుదుపు అని కిరణ్ సన్నిహితులు చెబుతున్నారు. ఈ విషయం తెలిసిన పలువురు తెలుగు సినీ ప్రముఖుు కిరణ్ కుటుంబానికి ప్రగాఢ సంతాపం ప్రకటించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Kiran abbavaram, Road accident, Tollywood