మహేష్ బాబు ఆఫర్‌కు నో చెప్పిన స్టార్ డైరెక్టర్..

Mahesh Babu: మహేష్ బాబు పిలిచి ఆఫర్ ఇస్తే ఏ దర్శకుడైనా నో చెప్తాడా..? తెలుగు ఇండస్ట్రీలో ఈయనతో వర్క్ చేయాలని అనుకోని దర్శకుడు ఉండడేమో..?

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 29, 2020, 8:37 PM IST
మహేష్ బాబు ఆఫర్‌కు నో చెప్పిన స్టార్ డైరెక్టర్..
మహేష్ బాబు (Mahesh Babu)
  • Share this:
మహేష్ బాబు పిలిచి ఆఫర్ ఇస్తే ఏ దర్శకుడైనా నో చెప్తాడా..? తెలుగు ఇండస్ట్రీలో ఈయనతో వర్క్ చేయాలని అనుకోని దర్శకుడు ఉండడేమో..? రాజమౌళి కూడా మహేష్ ఇమేజ్‌కు సరిపోయే కథ సిద్ధం చేయడానికి టైమ్ కావాలన్నాడు. పైగా ఇప్పుడు సూపర్ స్టార్ వరస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇలాంటి సమయంలో ఈయన సినిమా చేయమంటే నో చెప్పే వాళ్లెవరబ్బా అనుకుంటున్నారా..? ఉన్నాడు.. ఈ మధ్యే సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్ స్టార్‌కు అదిరిపోయే హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి.. ఇప్పుడు మరో సినిమా చేయమంటే నో చెప్పాడని తెలుస్తుంది. అయితే దీనికి కూడా ఓ కారణం లేకపోలేదు.

మహేష్ బాబు,అనిల్ రావిపూడి (Twitter/Photo)
మహేష్ బాబు,అనిల్ రావిపూడి (Twitter/Photo)


మహేష్ లాంటి హీరోతో పనిచేసే అవకాశం వస్తే మళ్లీ మళ్లీ సిద్ధంగానే ఉంటానని చెప్పిన అనిల్.. నో చెప్పడానికి ఓ బలమైన కారణం ఉంది. సరిలేరు నీకెవ్వరు తర్వాత వంశీ పైడిపల్లితో మహేష్ ఓ సినిమా చేయాలి. అయితే అనివార్య కారణాలతో ఈ చిత్రం ఆగిపోయింది. అదే సమయంలో పరుశురామ్ సినిమా చేయడానికి కూడా చాలా సమయం పడుతుంది. ఈ గ్యాప్‌లో అనిల్ రావిపూడితో మరో సినిమా చేయాలనుకున్నాడు సూపర్ స్టార్.

మహేష్ బాబు,అనిల్ రావిపూడి (Twitter/Photo)
మహేష్ బాబు,అనిల్ రావిపూడి (Twitter/Photo)


పైగా ఐదు నెలల్లోనే సరిలేరు నీకెవ్వరు చేసాడు కాబట్టి కచ్చితంగా వెంటనే మూడు నెలల్లో మరో కథ సిద్ధం చేసి.. ఇదే ఏడాది ఇంకో సినిమా చేయాల్సిందిగా అనిల్ రావిపూడికి మహేష్ బాబు ఆఫర్ ఇచ్చాడని తెలుస్తుంది. కానీ దీనికి ఈయన నో చెప్పాడు. మరీ మూడు నెలల్లో స్క్రిప్ట్ అంటే కష్టమవుతుందని.. ఓ ఆర్నెళ్లు టైమ్ ఇస్తే కథ చేస్తానని చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. కానీ అంత టైమ్ మహేష్ దగ్గర లేదు. దాంతో హడావిడిగా సినిమా చేసి లేనిపోని తలనొప్పులు తెచ్చుకునే కంటే కూడా సున్నితంగా నో చెప్పడమే బెటర్ అని.. మహేష్ బాబుకు సినిమా చేయనని అనిల్ చెప్పినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈయన ఎఫ్ 3తో పాటు రామ్ చరణ్ కోసం కథ సిద్ధం చేస్తున్నాడు.
First published: March 29, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading