కరోనాతో టాలీవుడ్ యువ హీరో తండ్రి మృతి.. విషాదంలో కుటుంబం..

తెలుగు సినీ ఇండస్ట్రీని కరోనా కోలుకోకుండా చేస్తోంది.

news18-telugu
Updated: July 9, 2020, 11:51 AM IST
కరోనాతో టాలీవుడ్ యువ హీరో తండ్రి మృతి.. విషాదంలో కుటుంబం..
నటుడు శ్రీనివాస్ Photo : facebook
  • Share this:
తెలుగు సినీ ఇండస్ట్రీని కరోనా కోలుకోకుండా చేస్తోంది. ఇప్పటికే గత రెండు నెలలుగా షూటింగ్స్ అన్ని బంద్ అవ్వడంతో ఎక్కడి సినిమాలు అక్కడే ఏ మాత్రం పురోగతి లేకుండా ఉండిపోయాయి. ప్రభుత్వం కొన్ని షరతులతో అనుమతి ఇచ్చిన కరోనాకు భయపడి చాలా వరకు షూటింగ్‌కు వెనుకడు వేస్తున్నారు నటీనటులు. కొందరూ ధైర్యంగా ముందడుగు వేస్తే ఈ కరోనా సోకి తీవ్ర ఇబ్బందుల్నీ ఎదుర్కోంటున్నారు. ఇటీవల బుల్లితెర నటులు రవికృష్ణ, రాజశేఖర్, సాక్షి శివ, సీరియల్ నటి నవ్యస్వామి వైరస్ బారినపడిన విషయం తెలిసిందే. ఇక కరోనా బారినపడిన నిర్మాత పోకూరి రామారావు ఇటీవల మృతి చెందగా తాజాగా టాలీవుడ్ నటుడు, ‘ఈ రోజుల్లో’ ఫేమ్ హీరో శ్రీ తండ్రి మంగం వెంకట దుర్గా రాంప్రసాద్ కరోనాతో కన్నుమూశారు. విజయవాడలోని ఓ ఆసుపత్రిలో గత 20 రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన గత రాత్రి 8:30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. దర్శకుడు మారుతి మొదటి సినిమా ‘ఈ రోజుల్లో’ శ్రీ హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత ‘లవ్ సైకిల్’, ‘పుస్తకంలో కొన్ని పేజీలు వంటి సినిమాల్లో నటించాడు శ్రీ.
Published by: Suresh Rachamalla
First published: July 9, 2020, 11:51 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading