Home /News /movies /

TOLLYWOOD WRITER KONA VENKAT TRIED TO SUICIDE ONCE UPON A TIME IN HIS BAD PERIOD OF LIFE PK

కోన వెంకట్ సూసైడ్ చేసుకుందామనుకున్న వేళ..

కోన వెంకట్‌పై చీటింగ్ కేసు

కోన వెంకట్‌పై చీటింగ్ కేసు

Kona Venkat: తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ రైటర్స్‌లో కోన వెంకట్ కూడా ఉంటాడు. కొన్నేళ్ల కింది వరకు త్రివిక్రమ్ తర్వాత అంతగా రెమ్యునరేషన్ తీసుకున్న రైటర్ ఈయన.

తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ రైటర్స్‌లో కోన వెంకట్ కూడా ఉంటాడు. కొన్నేళ్ల కింది వరకు త్రివిక్రమ్ తర్వాత అంతగా రెమ్యునరేషన్ తీసుకున్న రైటర్ ఈయన. వరస విజయాలతో సంచలనాలు సృష్టించాడు కోన వెంకట్. శ్రీనువైట్లతో విడిపోయిన తర్వాత కూడా ఈయన కొన్ని సినిమాలకు పని చేసాడు.. అవి హిట్ కూడా అయ్యాయి. గీతాంజలి, నిన్నుకోరి, జై లవకుశ లాంటి సినిమాలు ఈయన నుంచి వచ్చినవే. ఇప్పుడు కూడా అనుష్క శెట్టి నిశ్శబ్ధం సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు కోన వెంకట్. అయితే ఇలాంటి రైటర్ తన జీవితంలో జరిగిన సంచలన విషయాలు బయటపెట్టాడు.
కోన వెంకట్ (Kona Venkat)
కోన వెంకట్ (Kona Venkat)

ఒకానొక సందర్భంలో ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాడు. ఆ విషయం తెలిసిన తర్వాత అభిమానులతో పాటు ఇండస్ట్రీ వాళ్లు కూడా షాక్ అవుతున్నారు. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే కోన వెంకట్ లైఫ్‌లో ఇలాంటి చీకటి కోణాలు కూడా ఉన్నాయా అని ఆశ్చర్యపోతున్నారు. అప్పుడెప్పుడో ధర్మవరపు సుబ్రమణ్యం తెరకెక్కించిన తోక లేని పిట్ట సినిమాకు నిర్మాతగా ఇండస్ట్రీకి వచ్చిన కోన.. ఆ తర్వాత రైటర్, డైరెక్టర్, కో ప్రొడ్యూసర్ ఇలా చాలా చేసాడు.

ఇప్పుడు నిర్మాతగా సెటిల్ అయ్యాడు. అయితే పిల్లలకు స్కూల్ ఫీజులు కూడా కట్టలేని సందర్భంలో.. కుటుంబంతో పాటు చిన్న రూమ్‌లో ఉండాల్సిన పరిస్థితి వచ్చినపుడు ఒకేసారి 50 నిద్రమాత్రలు వేసుకుందామని అనుకున్నట్లు చెప్పాడు కోన వెంకట్. చనిపోదామనుకున్నానని సంచలన విషయం బయటపెట్టాడు ఈయన. తాజాగా ఈయన అలీతో సరదాగా షోకు వచ్చాడు. అక్కడ కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు కోన వెంకట్.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Kona venkat, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు