Home /News /movies /

TOLLYWOOD UPCOMING MUSIC DIRECTOR PRAMOD KUMAR PASSED AWAY DUE TO CARDIAC ARREST TA

Music Director Pramod Kumar Passed Away: చిత్రసీమలో మరో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు హఠాన్మరణం..

టాలీవుడ్ చిత్ర సీమలో మరో విషాదం (File/Photo)

టాలీవుడ్ చిత్ర సీమలో మరో విషాదం (File/Photo)

Music Director Pramod Kumar Passed Away : 2022 కూడా చిత్ర పరిశ్రమకు అసలు కలిసి రావడం లేదు. కరోనా కాలంలో చాలా మంది సినీ ప్రముఖులు, దర్శకులు, నిర్మాతలు టెక్నీషియన్స్‌తో పాటు పాటల రచయతలు ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. తాాజాగా టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సంగీత దర్శకుడు గుండెపోటుతో మరణించారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    7Music Director Pramod Kumar Passed Away : 2022 కూడా చిత్ర పరిశ్రమకు అసలు కలిసి రావడం లేదు. కరోనా కాలంలో చాలా మంది సినీ ప్రముఖులు, దర్శకులు, నిర్మాతలు టెక్నీషియన్స్‌తో పాటు పాటల రచయతలు ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. కొంత మంది వయసు రీత్యా వచ్చిన అనారోగ్యంతో కన్నుమూస్తే.. మరికొంత మంది హఠాన్మరణం చెందారు. తాజాగా తెలుగు సినీ పరిశ్రమలో సౌండ్ ఇంజినీర్‌గా పలు చిత్రాలకు పనిచేసిన ప్రమోద్ కుమార్ పరిసర్ల గుండెపోటుతో హఠాన్మరణం చెందడం సినీ పరిశ్రమను ఉలిక్కిపాటకు గురిచేసింది. రీసెంట్‌గా ఈయన ఒక సినిమాకు సంగీత దర్శకత్వం కూడా వహించారు. ఆ సినిమా విడుదలకు ముందే ఈయన కన్నుమూయడం విషాదకరం. ఎఫ్ 2, కాలాయ తస్మై నమ: వంటి సినిమాలకు ఆయన సౌండ్ ఇంజినీర్‌గా పని చేశారు.

    కేవలం సినిమాలకు మాత్రమే కాదు.. కొన్ని ప్రకటనలకు, షార్ట్ ఫిల్మ్స్‌కు ఈయన సంగీత దర్శకుడిగా పనిచేసారు. ఇక ఈయన మ్యూజిక్ డైరెక్షన్ చేసిన ‘దామినీ విల్లా’ విడుదలకు రెడీగా ఉంది. ఆ సినిమా రిలీజ్ లోపే ఈయన కన్నుమూసారు. ఈ సినిమాలో ఆదిత్య ఓం హీరోగా నటించారు. రేఖా బోజ్ కథానాయికగా నటించారు. ఈ మధ్యనే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ప్రమోద్ కుమార్ మృతి సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
    o
    ఇక ఈ యేడాది కన్నమూసిన సినీ ప్రముఖుల్లో  భారతీయ సంగీత ప్రపంచంలో మేన నగధీరురాలు.. భారతరత్న లతా మంగేష్కర్  ఆమె మహాభినిష్క్రమణతో భారతీయ సంగీతం ప్రపంచం నివ్వెర పోయింది. మరోవైపు సూపర్ స్టార్ కృష్ణ తనయుడు.. మహేష్ బాబు అన్న రమేష్ బాబు కూడా అకాల మరణం చెందారు. అటు సీనియర్ నటుడు బాలయ్య కూడా ఈ ఇయరే ఈ లోకాన్ని విడిచి వెళ్లారు.

    Chiranjeevi As God Father: చిరంజీవి గాడ్ ఫాదర్ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్..


    అటు  తన సంగీతంతో ప్రేక్షకులను ఊర్రూతలూగించిన బప్పీలహరి కూడా కన్నుమూయడం సినీ సంగీతాభిమానులను తీవ్ర కలతకు గురి చేసింది. మరోవైపు టాలీవుడ్ సినీ సంగీతంలో తన పాటలతో మైమరిపించిన కందికొండ  కాన్సర్‌తో కన్నుమూసారు. తాజాగా టాలీవుడ్‌లో తనదైన యాక్షన్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శరత్, తాతినేని రామారావు సహా ఇతర భాషలకు చెందిన పలువురు సినీ ప్రముఖులు కన్నుమూయడం విషాదకరం.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Telugu Cinema, Tollywood

    తదుపరి వార్తలు