బిగ్‌బాస్ 4 అంతా సిద్ధం.. హోస్ట్‌గా మళ్లీ ఎన్టీఆర్.. ?

తెలుగులో బిగ్ బాస్ ప్రోగ్రామ్‌కు మంచి క్రేజే ఉంది. తెలుగు ప్రేక్షకులు ఈ రియాలిటీ షోకు బాగానే కనెక్ట్ అయ్యారు. ఇప్పటకే ఈ షో మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. తాజాగా నాల్గో సీజన్‌ను హోస్ట్ చేయబోయే హీరో ఎవరనేది కన్ఫామ్ అయింది.

news18-telugu
Updated: December 6, 2019, 4:40 PM IST
బిగ్‌బాస్ 4 అంతా సిద్ధం.. హోస్ట్‌గా మళ్లీ ఎన్టీఆర్.. ?
బిగ్ బాస్ 1 హోస్ట్‌‌గా జూనియర్ ఎన్టీఆర్ (File/Photo)
  • Share this:
తెలుగులో బిగ్ బాస్ ప్రోగ్రామ్‌కు మంచి క్రేజే ఉంది. తెలుగు ప్రేక్షకులు ఈ రియాలిటీ షోకు బాగానే కనెక్ట్ అయ్యారు. ఇప్పటకే ఈ షో మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇపుడు నాల్గో సీజన్‌కు మొదలు కావడానికి చాలా సమయం ఉన్న ఇప్పటి నుంచే ఈ సీజన్‌ను ఎవరు హోస్ట్ చేయబోతున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది. రెండు మూడు సీజన్స్‌తో పోలిస్తే.. మొదటి సీజన్‌ను ఎన్టీఆర్ తనదైన శైలిలో రక్తి కట్టించాడు. తెలుగు ఆడియన్స్‌కు ఏ మాత్రం తెలియని ఈ  రియాల్టీ షోను జూనియర్ ఎన్టీఆర్ విజయ తీరాలకు చేర్చడంలో సక్సెస్ అయ్యాడు. మొదటి సీజన్‌ సక్సెస్ కావడంతో  అందరి దృష్టి రెండో సీజన్‌పై పడింది. రెండో సీజన్ సమయానికి ఎన్టీఆర్ తన బిజీ షెడ్యూల్స్ కారణంగా చేయలేకపోయాడు. దీంతో రెండో సీజన్‌ను నాని హోస్ట్ చేసాడు. ఎన్టీఆర్ రేంజ్‌లో కాకపోయినా.. ఉన్నంతలో ఈ షోను నడిపించి ఓకే అనిపించుకున్నాడు. ఐతే.. ఈ సీజన్‌లో కౌశల్ మాత్రం బిగ్‌బాస్ 2 విన్నర్‌గా పాపులర్ అయ్యాడు.

Nagarjuna Akkineni beaten Jr NTR and Natural Star Nani in TRP Ratings with Bigg Boss season 3 final pk తెలుగు బుల్లితెరపై సంచలనంగా మొదలైన రియాలిటీ షో బిగ్ బాస్. అప్పటి వరకు హిందీ వాళ్లకు మాత్రమే పరిచయం ఉన్న ఈ షోను జూనియర్ ఎన్టీఆర్ మనకు పరిచయం చేసాడు. ఇక రెండో సీజన్ నాని.. nagarjuna,nagarjuna akkiineni,nagarjuna akkineni jr ntr,jr ntr nani nagarjuna akkineni,bigg boss 3 telugu final trp rating,nagarjuna akkineni twitter,bigg boss telugu 3,bigg boss 3,bigg boss 3 telugu,bigg boss,bigg boss 3 winner,bigg boss 3 tamil,bigg boss tamil 3,bigg boss season 3,telugu bigg boss 3,bigg boss telugu,bigg boss 3 grand finale,bigg boss 3 telugu promo,bigg boss shiva jyothi,bigg boss telugu season 3,bigg boss telugu 3 winner,bigg boss 3 telugu,bigg boss 3 telugu trp rating,bigg boss telugu season 3,bigg boss 3,bigg boss 3 telugu promo,bigg boss 3 telugu contestants,bigg boss 3 telugu winner,bigg boss telugu 3,bigg boss 2 telugu trp rating,bigg boss telugu season 3 rating,bigg boss 3 telugu latest promo,telugu bigg boss 3,bigg boss telugu season 3 trp ratings,బిగ్ బాస్ 3 సీజన్ ఫైనల్,నాగార్జున బిగ్ బాస్ 3 ఫైనల్,నాగార్జున బిగ్ బాస్ 3 ఫైనల్ రేటింగ్,నాగార్జు నాని,నాని నాగార్జున జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్,తెలుగు సినిమా
జూనియర్ ఎన్టీఆర్ నాని


ఇక బిగ్‌బాస్ వంటి ప్రోగ్రామ్‌ను తప్పు పట్టిన నాగార్జున.. మూడో సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించడం సంచలనంగా మారింది. నాగ్ కూడా ఈ షోను తనదైన సమయస్పూర్తితో మెప్పించాడు. మూడో సీజన్‌ కంప్లీటైన తర్వాత నాల్గో సీజన్‌కు హోస్ట్ ఎవరనే విషయం పై తర్జన భర్జనలు నడుస్తున్నాయి. నాల్గో సీజన్ కోసం నాగార్జునను కంటిన్యూ చేస్తారా.. లేకపోతే నానితో భర్తి చేస్తారా అనే విషయమై స్టార్ మా నిర్వాహకులు సంప్రదింపులు చేస్తున్నారు. ఫైనల్‌గా సీజన్‌ను మరోసారి ఎన్టీఆర్‌తో హోస్ట్ చేయించాలని స్టార్ మా నిర్వాహకులు భావిస్తున్నారు. గతంలో రెండో సీజన్ సమయంలో అరవింద సమేత షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. మూడో సీజన్ వచ్చేసరికి రాజమౌళి దర్శకత్వంలో ‘RRR’ షూటింగ్‌కే అంకింతం అయిపోయాడు.అందుకే రెండు, మూడు సీజన్ ఎన్టీఆర్ చేయలేకపోయాడు.

bigg boss 3 show management played drama for get trp ratings here are the details,bigg boss 3 telugu host nagarjuna,nagarjuna,nagarjuna bigg boss 3,nagarjuna star maa,nagarjuna twitter,nagarjuna facebook,bigg boss 3 telugu final winner,bigg boss 3,bigg boss 3 telugu,bigg boss 3 telugu host,bigg boss telugu season 3,bigg boss,bigg boss 3 telugu contestants,bigg boss 3 telugu host nagarjuna,bigg boss telugu,telugu bigg boss 3,bigg boss telugu 3,bigg boss 3 telugu contestants list,nagarjuna bigg boss 3,bigg boss season 3 telugu,bigg boss telugu season 3 host,bigg boss 3 telugu promo,nagarjuna,srimukhi,tollywood,telugu cinema,నాగార్జున,శ్రీముఖి,రాహుల్,వరుణ్ సందేశ్,బిగ్‌బాస్ 3 టైటిల్ విన్నర్,నాగార్జున విఫలం,బిగ్‌బాస్ 3గా నాగార్జున విఫలం
బిగ్‌బాస్ 3 తెలుగు (Star Maa/Photo)


అందుకే స్టార్ మా నిర్వాహకులు ..ఈ సారి మాత్రం బిగ్‌బాస్ సీజన్‌ 4ను ఎన్టీఆర్‌తో చేయించాలనే పట్టుదలతో ఉన్నారు. అంతేకాదు ఈ షోను హోస్ట్ చేయడానికి తారక్‌కు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్టు సమాచారం. దానికి ఎన్టీఆర్ఓ కూడా ఒకే చెప్పినట్టు చెబుతున్నారు. ఎన్టీఆర్ అప్పటికీ వేరే సినిమాలతో బిజీగా ఉన్న  కూడా రాజమౌళి, త్రివిక్రమ్ అంతా టైట్ షెడ్యూల్ ఉండదు. అందుకే ఎన్టీఆర్ ఈ షో చేయడానికి ఓకే చెప్పినట్టు స్టార్ మా వర్గాల సమాచారం. తొందర్లనే బిగ్‌బాస్ 4 హోస్ట్ విషయమై అఫీషియల్ ప్రకటన రావడమే తరువాయి అంటున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: December 6, 2019, 4:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading