Suresh Babu: అఫైర్స్ గురించి ఆసక్తికరమైన నిజాలు చెప్పిన నిర్మాత సురేష్ బాబు..

సురేష్ బాబు (Suresh Babu)

Suresh Babu: సాధారణంగా నిర్మాత సురేష్ బాబు నోటి నుంచి బాక్సాఫీస్ లెక్కలు.. సినిమా బడ్జెట్‌లు.. రిలీజ్ డేట్స్ తప్ప మరో విషయాలే రావు. తన ధ్యాస మొత్తం సినిమాలపైనే ఉంటుంది.

  • Share this:
సాధారణంగా నిర్మాత సురేష్ బాబు నోటి నుంచి బాక్సాఫీస్ లెక్కలు.. సినిమా బడ్జెట్‌లు.. రిలీజ్ డేట్స్ తప్ప మరో విషయాలే రావు. తన ధ్యాస మొత్తం సినిమాలపైనే ఉంటుంది. అంతగా సినిమాలతోనే మమేకం అయిపోయాడు ఈయన. ఎప్పుడు చూసినా కూడా సినిమాల ప్రొడక్షన్ గురించి మాట్లాడుతుంటాడు ఈ నిర్మాత. చిన్ననాటి నుంచి సినిమా వాతావరణంలోనే పెరగడంతో వాటిపైనే దృష్టి కేంద్రీకరించాడు. మూవీ మొఘల్ రామానాయుడు ముందు నుంచి కూడా సురేష్ బాబును హీరో చేయాలనుకున్నాడు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేసాడు ఈ లెజెండరీ నిర్మాత. అయితే కొన్ని పరిస్థితుల కారణంగా ఆయన ఏ రోజు కూడా నటన వైపు ఆసక్తి చూపించలేదు. చిన్నప్పటి నుంచి కూడా నిర్మాణ రంగంలోనే ఉన్నాడు సురేష్ బాబు.

ఇదే విషయాన్ని చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాడు ఈయన. కెరీర్‌లో తాను కొన్ని విషయాల్లో ముందు నుంచే ఫిక్స్ అయిపోయి ఉండటంతో నటన వైపు వెళ్లలేదని చెప్పాడు. అంతేకాదు తనకు నటుడిగా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నా.. ఎంతోమంది తనను ప్రోత్సహించినా కూడా అటు వైపు అడుగులు వేయలేదని చెప్పుకొచ్చాడు సురేష్ బాబు. అందుకే తాను అనుకున్నది సాధించగలిగాను అంటున్నాడు ఈయన. అంతేకాదు.. తన పిన్ని భర్తను చూసి తాగడం అనేది జీవితంలో అలవాటు చేసుకోలేదని చెప్పాడు సురేష్ బాబు.
suresh babu,suresh babu twitter,suresh babu instagram,suresh babu movies,suresh babu producer,suresh babu about affairs,telugu cinema,సురేష్ బాబు,సురేష్ బాబు నిర్మాత,సురేష్ బాబు ఎఫైర్స్ గురించి నిజాలు
సురేష్ బాబు (Suresh Babu)

తాగడంతోనే పిన్ని జీవితం నాశనం అయిపోయిందని.. అందుకే అలాంటి అలవాట్లు దరిచేరనీయలేదని చెప్పాడు సురేష్ బాబు. అవకాశం ఉన్నా కూడా ఎవరితో అఫైర్ పెట్టుకోలేదని.. జీవితంలో ఎప్పుడో ఒకసారి పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది కదా వచ్చే భార్యకు అన్యాయం చేయకూడదని ముందుగానే నిర్ణయించుకున్నట్లు చెప్పాడు ఈయన. తనకు వచ్చే భార్య మరొకరితో ఎఫైర్ పెట్టుకుంటే దానిని భరించగల శక్తి ఉంటే.. అప్పుడు తాను కూడా వేరే వాళ్ళతో ఎఫైర్ పెట్టుకోవాలని అనుకున్నాను అంటున్నాడు ఈయన. అంత శక్తి తనకు లేదు కాబట్టి అలాంటి ఆలోచనలు కూడా చేయలేదంటున్నాడు ఈయన. మొత్తానికి సురేష్ బాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి.
Published by:Praveen Kumar Vadla
First published: