Suresh Babu: ఆ భూమి మా స్వార్జితం.. ప్రభుత్వంతో సంబంధం లేదంటున్న సురేష్ బాబు..

సురేష్ బాబు (Suresh Babu)

Suresh Babu: నారప్ప(Naarappa) సినిమా విడుదల సందర్భంగా చిత్ర నిర్మాత సురేష్ బాబు(Suresh Babu) ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో చాలా విషయాల గురించి ఓపెన్ అయ్యాడు ఈ సీనియర్ నిర్మాత. ముఖ్యంగా సినిమా విడుదలలు.. వాటిపై ఓటిటి ప్రభావం గురించి మాట్లాడాడు సురేష్ బాబు.

  • Share this:
నారప్ప సినిమా విడుదల సందర్భంగా చిత్ర నిర్మాత సురేష్ బాబు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో చాలా విషయాల గురించి ఓపెన్ అయ్యాడు ఈ సీనియర్ నిర్మాత. ముఖ్యంగా సినిమా విడుదలలు.. వాటిపై ఓటిటి ప్రభావంతో పాటు మరికొన్ని కీలకమైన విషయాలపై కూడా ఓపెన్ అయ్యాడు ఈ నిర్మాత. దాంతో పాటు నారప్ప సినిమాను థియేటర్స్‌లో కాకుండా ఎందుకు ఓటిటిలో విడుదల చేస్తున్నామనే విషయంపై కూడా క్లారిటీ ఇచ్చాడు సురేష్ బాబు. రాబోయే రోజుల్లో ఓటిటి ఎంత కీలకంగా మారనుందో కూడా చెప్పాడు ఈ నిర్మాత. తెలుగు ఇండస్ట్రీలో సురేష్ ప్రొడక్షన్స్ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పడానికేం లేదు. ఈ మధ్యే 50 ఏళ్లు కూడా పూర్తి చేసుకుంది సురేష్ ప్రొడక్షన్స్‌. ఈ సందర్భంగా డిజిటల్ రంగంలోకి కూడా అడుగు పెట్టనుంది. సొంతంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించడానికి సురేష్ బాబు సన్నాహాలు చేస్తున్నాడు. దాంతో పాటు మ్యూజిక్‌ రంగంలోనూ అడుగుపెడుతున్నారు. తాజా ఇంటర్వ్యూలో సురేష్‌ బాబు చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చాడు.

సురేష్ ప్రొడక్షన్స్‌ త్వరలో సొంత ఓటీటీని ప్రారంభిస్తుంది.. ఇప్పటికే కంటెంట్‌ క్రియేట్‌ చేయడం ప్రారంభించామని తెలిపాడు సురేష్ బాబు. అలాగే 'ఎస్‌ పీ మ్యూజిక్స్‌' ప్రారంభిస్తున్నామని తెలిపాడు. నారప్పలో రెండు పాటలను దీని ద్వారానే విడుదల చేస్తున్నామని చెప్పాడు సురేష్ బాబు. ఇదిలా ఉంటే వైజాగ్‌లో రామానాయుడు స్టూడియోస్‌ తన స్వార్జితం అని.. అది ప్రభుత్వం ఇచ్చిన భూమి కాదని కన్పర్మ్ చేసాడు సురేష్ బాబు.
suresh babu,suresh babu twitter,suresh babu land in vizag,suresh babu instagram,suresh babu ott release,suresh babu comments on OTT,suresh babu narappa ott release,telugu cinema,సురేష్ బాబు,సురేష్ బాబు నారప్ప ఓటిటి రిలీజ్,ఓటిటిపై స్పందించిన నిర్మాత సురేష్ బాబు,సురేష్ బాబు వైజాగ్ ల్యాండ్
నిర్మాత సురేష్ బాబు (Suresh Babu)

మార్కెట్‌ ధర కన్నా ఎక్కువ చెల్లించి కొన్నానని తెలిపాడు ఈయన. భవిష్యత్‌లోనూ అక్కడ స్టూడియో నడుపుతామని క్లారిటీ ఇచ్చాడు. ప్రజా ప్రయోజనం కోసం ప్రభుత్వం ఏ భూమినైనా సేకరించవచ్చు కానీ దానికి తగిన పరిహారం చెల్లించాలని చెప్పాడు సురేష్ బాబు.
Published by:Praveen Kumar Vadla
First published: