Suresh Babu: సినిమాను ఎక్కడ రిలీజ్ చేయాలో నిర్మాత ఇష్టం.. ఓటిటిపై కుండ బద్ధలు కొట్టిన సురేష్ బాబు..

సురేష్ బాబు (Suresh Babu)

Suresh Babu: స్టార్ హీరోల సినిమాలను ఓటిటి రిలీజ్ చేయడం ఏంటి.. అలా చేస్తే థియేటర్ వ్యవస్థను నాశనం చేసినట్లే కదా అని వాదించే వాళ్లు కూడా లేకపోలేదు. ఇదే విషయంపై ఇప్పుడు నిర్మాత సురేష్ బాబు(Suresh Babu) కూడా మాట్లాడారు. ఈయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

  • Share this:
ఈ మధ్య కాలంలో ఓటిటి రిలీజ్‌లు ఎక్కువ అవుతున్నాయి. స్టార్ హీరోల సినిమాలను కూడా నేరుగా డిజిటల్ ప్లాట్ ఫామ్‌లో విడుదల చేస్తున్నారు నిర్మాతలు. మంచి రేట్ వచ్చినపుడు ఎందుకు థియేటర్స్ కోసం వేచి చూడటం అని వాళ్ల అభిప్రాయం. పైగా ఇప్పుడు బయట పరిస్థితులు కూడా బాగోలేవు కదా.. అలా పూర్తైన సినిమాను ఎన్నాళ్లు అలాగే బాక్సుల్లో దాచేయడం.. ఓటిటిలో విడుదల చేయడం బెటర్ కదా అంటున్నారు నిర్మాతలు. కానీ మరికొందరు మాత్రం అలా థియేటర్స్ కాకుండా ఓటిటిలో విడుదల చేయడం సరైన పద్దతి కాదంటున్నారు. మరీ ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలను ఓటిటి రిలీజ్ చేయడం ఏంటి.. అలా చేస్తే థియేటర్ వ్యవస్థను నాశనం చేసినట్లే కదా అని వాదించే వాళ్లు కూడా లేకపోలేదు. ఇదే విషయంపై తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రత్యేకంగా ఓ మీటింగ్ పెట్టి మరీ ఓటిటికి సినిమాలు ఇవ్వొద్దని నిర్మాతలకు విన్నవించుకున్నారు. అయినా కూడా కొందరు ఇస్తూనే ఉన్నారు. తాజాగా నారప్ప సినిమాను జులై 20న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.

దీనిపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయలు వస్తున్నాయి. సురేష్ బాబు కూడా ఓటిటి రిలీజ్ గురించి మనసు విప్పాడు. నారప్ప టాపిక్ తీసుకుని రాకుండా ఇష్యూను నిర్మాతల కోణంలో మాట్లాడాడు సురేష్ బాబు. సినిమా బిజినెస్‌లో తప్పు, ఒప్పులు చూడటం సమంజసం కాదని.. ఓ సినిమా కోసం నిర్మాత కోట్లు ఖర్చు పెడతాడని గుర్తు చేసాడు. అలాంటి నిర్మాతలకు సినిమాపై సర్వహక్కులు ఉంటాయని.. తన సినిమాను ఎక్కడైనా విడుదలు చేసుకునే స్వాతంత్య్రం అతడికి ఉంటుందని చెప్పుకొచ్చాడు. కరోనా సమయంలో థియేటర్స్ యాజమాన్యమే కాదు నిర్మాతలు కూడా నష్టపోయారనే విషయాన్ని గుర్తు చేసాడు సురేష్ బాబు.
suresh babu,suresh babu twitter,suresh babu instagram,suresh babu ott release,suresh babu comments on OTT,suresh babu narappa ott release,telugu cinema,సురేష్ బాబు,సురేష్ బాబు నారప్ప ఓటిటి రిలీజ్,ఓటిటిపై స్పందించిన నిర్మాత సురేష్ బాబు
నిర్మాత సురేష్ బాబు (Suresh Babu)

అలాంటి సమయంలో మంచి రేట్ వచ్చినపుడు సినిమాను ఓటిటి విడుదల చేయడం తప్పేం కాదంటున్నాడు ఈయన. బిజినెస్ కోణంలోనే ఇదంతా ఆలోచించాలని తెలిపాడు సురేష్ బాబు. ప్రస్తుతం ఉన్న పోటీలో సినిమాలను థియేటర్‌లో విడుదల చేయడం కంటే మంచి రేట్ తీసుకుని పోటీ లేని ఓటిటిలో విడుదల చేయడమే నయం అనేది సురేష్ బాబు ఆలోచనగా కనిపిస్తుంది. ఈయన మాటలపై కూడా భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. కొందరు సురేష్ బాబు చెప్పింది నిజమే కదా అంటుంటే.. మరికొందరు మాత్రం థియేటర్స్‌లోనే సినిమాలను విడుదల చేయాలంటున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published: