Tollywood Producer : మహేష్ బాబు నిర్మాత కన్నుమూత.. విషాదంలో చిత్రసీమ..

టాలీవుడ్ నిర్మాత వెంకట్ కన్నుమూత (File/Photo)

Tollywood Producer Venkat : ప్రముఖ చిత్ర నిర్మాత ఆర్ఆర్ మూవీ మేకర్స్ అధినేత వెంకట్.. అనారోగ్యంతో కాసేపటి క్రితమే కన్నుమూశారు.

  • Share this:
    Tollywood Producer Venkat : ప్రముఖ చిత్ర నిర్మాత ఆర్ఆర్ మూవీ మేకర్స్ (RR Movie Makers) అధినేత వెంకట్.. అనారోగ్యంతో కాసేపటి క్రితమే కన్నుమూశారు. ఈయన గత కొన్నేళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నారు. గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఈయన చికిత్స తీసుకుంటున్నారు. ఈయన తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ముఖ్యంగా అచ్చిరెడ్డి(Atchi Reddy), ఎస్వీ కృష్ణారెడ్డి (SV Krishna Reddy)లతో కలిసి ‘హంగామా’ సినిమాతో నిర్మాతగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టారు. ఆ సినిమా సక్సెస్‌తో ఈయన వెనుదిరిగి చూసుకోలేదు. అంతేకాదు బడా హీరోలతో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ముఖ్యంగా మహేష్ బాబు (Mahesh Babu)తో ‘బిజినెస్ మేన్’(Business Man) చిత్రాన్ని నిర్మించారు. పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా ఆర్ ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌ వాల్యూను పెంచింది.

    మరోవైపు రవితేజ‌తో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘కిక్’ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసింది. అటు రవితేజతో డాన్ శీను, మిరపకాయ్’ వంటి చిత్రాలను నిర్మించారు.  మరోవైపు ఆది సాయి కుమార్ మొదటి చిత్రం ‘ప్రేమ కావాలి’తో పాటు నాగార్జునతో ఢమరుకం, బాలయ్యతో శ్రీమన్నారాయణ’ పైసా, ’పూల రంగడు’ వంటి చిత్రాలను నిర్మించారు. ఈయన మరణంపై టాలీవుడ్ చిత్ర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

    Nagarjuna Akkineni - Amala : నాగార్జున అక్కినేని, అమల టాలీవుడ్ సూపర్ హిట్ రియల్ అండ్ రీల్ లైఫ్ జోడి..

    ఆర్ ఆర్ మూవీ మేకర్స్ అధినేత ఆర్ ఆర్ వెంకట్ మృతితో పాటు  యేడాది తెలుగు, తమిళ, హిందీ, కన్నడ చిత్ర పరిశ్రమ అనే తేడా లేకండా  భారతీయ చిత్ర పరిశ్రమలో అన్ని ఇండస్ట్రీస్‌లో వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి. నిన్న మొన్నటి వరకు కరోనాతో చాలా మంది దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు కన్నుమూసారు. ఇప్పటికే తమిళ కమెడియన్ వివేక్.. ఆ తర్వాత సీనియర్ నటుడు పొట్టి వీరయ్య..  దర్శకుడు సాయి బాలాజీ, దర్శకుడు కేవి ఆనంద్ వంటి వారు కన్నుమూసారు.

    Tollywood Thatha Manavallu : ఎన్టీఆర్ టూ నాగ చైతన్య వయా అల్లు అర్జున్, రానా వరకు టాలీవుడ్‌లో సత్తా చూపెడుతోన్న మనవళ్లు..

    అటు బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్‌తో పాటు అలనాటి కథానాయికగా జయంతి, ఆనంద్ కణ్ణన్‌తో, హాలీవుడ్ నటుడు మైఖేల్ విలియమ్‌తో పాటు అక్షయ్ కుమార్ తల్లి అరుణా భాటియాతో పాటు ప్రముఖ నటుడు ఉత్తేజ్ భార్య పద్మావతి కూడా అనారోగ్యంతో కన్నుమూసారు. అటు మలయాళ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు రిజబావాతో పాటు హీరోయిన్ నందిత శ్వేత తండ్రి కూడా అనారోగ్యంతో ఈ యేడాదే కన్నుమూయడం విచారకరం. రీసెంట్‌గా పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ కన్నుమూశారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: