తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాతలలో దిల్ రాజు (Dil Raju) కూడా ఒకడు. ఆయన ఔనంటే కాదనే హీరోలే లేరిక్కడ. ఎప్పుడు ఎవరి డేట్స్ కావాలన్నా కూడా వెంటనే తీసుకొచ్చే దమ్ము ధైర్యం ఆయన సొంతం. అలాంటి రూలింగ్ నిర్మాత.. ప్రభాస్‌కు (Prabhas) ఎందుకు క్షమాపణలు చెప్పాడు అనుకుంటున్నారా..? ఇది జరిగి దాదాపు 15 ఏళ్ళైంది. దిల్ రాజు బ్యానర్‌లో ప్రభాస్ రెండు సినిమాలు చేసాడు. మొదటి సినిమా ‘మున్నా’ (Munna) అయితే.. రెండో సినిమా మిస్టర్ పర్ఫెక్ట్. మున్నా 2007లో విడుదలైంది. ఈ సినిమాతోనే వంశీ పైడిపల్లిని (Vamshi Padipally) దర్శకుడిగా పరిచయం చేసాడు దిల్ రాజు. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం దారుణంగా నిరాశ పరిచింది. ఈ చిత్రంతో ప్రభాస్ పెద్ద హిట్ ఊహించాడు కానీ అది జరగలేదు.
దిల్ రాజు కూడా భారీ ఖర్చుతో మున్నా సినిమాను నిర్మించాడు. కానీ ఊహించని విధంగా ఈ సినిమా రిజల్ట్ తేడా కొట్టింది. అప్పటికే యోగితో డిజాస్టర్ ఇచ్చిన ప్రభాస్‌కు మరో బ్యాక్ టూ బ్యాక్ ప్లాప్ వచ్చింది. దాంతో ప్రభాస్ మార్కెట్ మరింత దెబ్బ తింది. ఈ సినిమా ఫ్లాప్‌తో నిర్మాత దిల్ రాజు బాగా హర్ట్ అయ్యాడు. సుదర్శన్ 35 ఎం.ఎంలో సినిమా చూసిన వెంటనే ప్రభాస్ దగ్గరికి వెళ్లి.. ‘ప్రభాస్ నీకు హిట్ ఇవ్వలేకపోయాను సారీ’ అని చెప్పి బాధపడ్డాడు రాజు. ఈ విషయాన్ని చెప్పింది కూడా ఎవరో కాదు.. స్వయంగా దిల్ రాజే.
మున్నా ఫ్లాప్‌కు పూర్తి బాధ్యత దిల్ రాజు తీసుకున్నాడు. ఆ సినిమాతో ప్రభాస్ ఆశలు నెరవేరనందుకు బాధ పడ్డాడు రాజు. అయితే ఆ తర్వాత మూడేళ్ళకు అదే హీరోతో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా చేసి హిట్ ఇచ్చాడు. దశరత్ తెరకెక్కించిన ఈ చిత్రం యూత్ అండ్ ఫ్యామిలీ ప్రేక్షకుల్లో ప్రభాస్ ఫాలోయింగ్ పెంచేసింది. అప్పటికి ప్రభాస్ కెరీర్లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమా కూడా ఇదే. ఇందులో ముందుగా రకుల్ ప్రీత్ సింగ్‌ను హీరోయిన్‌గా అనుకున్నా చివరికి కాజల్, తాప్సీ (Kajal Aggarwal, Taapsee) వచ్చారు. ఈ విషయాన్ని దిల్ రాజు ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
Here's The Promo Of 'SVC50' TVK Episode 1.https://t.co/kbRPGhDvTa it was a real pleasure to sit down and interview - the ace producer #DilRaju garu for TVK. Full episode tomorrow ?#TVKwithRajeshManne #SVC50 #DilRajuExclusiveInterview
— Rajesh Manne (@rajeshmanne1) March 17, 2022
అందుకు సంబంధించిన ప్రోమో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతుంది. అంతే కాదు ‘ఆర్య’ సినిమా కథని అల్లు అర్జున్ (Allu Arjun) కంటే ముందు చాలా మంది హీరోలకి వినిపించామని.. అందులో రవితేజ (Ravi Teja) తో పాటు ప్రభాస్ కూడా ఉన్నాడని దిల్ రాజు చెప్పాడు. ప్రభాస్‌తో సినిమా నిర్మించినా.. నిర్మించకపోయినా ఆయన సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసాడు దిల్ రాజు. ఇదిలా ఉంటే త్వరలోనే ప్రభాస్‌తో ఓ పాన్ ఇండియా సినిమాని నిర్మించేందుకు రెడీ అవుతున్నాడు దిల్ రాజు. ఈ సినిమా కోసం రోజుకు దాదాపు 1.20 కోట్లు ప్రభాస్ పారితోషికంగా తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లోనే ఈ సినిమా తెరకెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.