Home /News /movies /

Tollywood Top News : ఈరోజు సినిమా వార్తల్లో ముఖ్యాంశాలు..

Tollywood Top News : ఈరోజు సినిమా వార్తల్లో ముఖ్యాంశాలు..

టాలీవుడ్ టాప్ న్యూస్ Photo : Twitter

టాలీవుడ్ టాప్ న్యూస్ Photo : Twitter

Tollywood Top News : ఈరోజు సినిమా వార్తల్లో ముఖ్యాంశాలు.. ఓ లుక్కేయండీ...

  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు.. వైద్యులను విచారించిన పోలీసులు..

  బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసు రోజురోజుకీ మరింత ఆసక్తికరంగా మారుతుంది. ముంబైలోని తన ఇంట్లోనే జూన్ 14న చనిపోయాడు ఈయన. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఈ కేసును ముంబై పోలీసులు విచారిస్తూనే ఉన్నారు. ముందు అనుమానాస్పద మృతిగా ఫైల్ చేసినా కూడా ఆ తర్వాత ఆత్మహత్య అని తేల్చేసారు పోలీసులు. ఉరి వేసుకోవడం వల్లే చనిపోయాడు అంటూ పోస్టుమార్టం రిపోర్టులో కూడా బయటికి వచ్చింది. పూర్తి కథనం కోసం లింక్..

  సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి..

  సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు అలుముకుంటున్నాయి. ఇటీవల రిషీ కపూర్, ఇర్ఫాన్ ఖాన్, సంగీత దర్శకుడు వాజీద్ ఖాన్, డాన్స్ మాస్టర్ సరోజ్ ఖాన్, జగదీప్ వంటి స్టార్లను కోల్పోయింది. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బలవన్మరణానికి పాల్పడటం ఊహించని విషాదం. ఈ మధ్యే బాలీవుడ్‌ సినీ, టీవీ నటుడు రాజన్‌ సెహగల్, ప్రముఖ మోడల్‌, నటి, గాయని దివ్య చోక్సీ కూడా కన్నుమూశారు. తాజాగా ప్రముఖ దర్శకుడు రాజత్ ముఖర్జీ మరణించారు. దీంతో బాలీవుడ్ పరిశ్రమ విషాదంతో నిండింది. కొంత కాలంగా రాజత్ ముఖర్జీ అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం మృతిచెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. పూర్తి కథనం కోసం లింక్..

  నెపోటిజంపై హీరోయిన్ ఘాటు వ్యాఖ్యలు.. ఎగ్జామ్ లేకుండా డాక్టర్ అవ్వోచ్చా...

  హిందీ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం బాలీవుడ్‌ను కుదిపేస్తోంది. ఆ ఘటన తర్వాత సినీ ఇండస్ట్రీలో నెపోటిజం (బంధుప్రీతి) గురించి తీవ్ర చర్చ జరుగుతోంది. సినీ ఇండస్ట్రీలో చిన్నోళ్లు పెద్దోళ్లు అందరూ దీని గురించి మాట్లాడుతున్నారు. సుశాంత్ అభిమానులైతే.. కరణ్ జోహార్ అండ్ గ్యాంగ్ వలనే సుశాంత్ ఆ చర్యలకు పాల్పడ్డాడని సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్న సంగతి తెలిసిందే. ఆ చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు బంధుప్రీతిపై తమ అభిప్రాయాలను వెల్లడించగా.. తాజాగా నెపోటిజం పై హీరోయిన్ శ్రద్ధాదాస్ స్పందించింది. పూర్తి కథనం కోసం లింక్..

  RGV : పవర్ స్టార్ నుంచి గడ్డి తింటావా పాట..

  Power Star : వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ ఈ లాక్ డౌన్‌లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ అదరగొడుతున్నాడు. అడల్ట్ స్టార్ మియా మాల్కోవాతో క్లైమాక్స్ తీసిన ఆయన.. ఆ తర్వాత కొత్త అమ్మాయి శ్రీ రాపాకతో నగ్నం తీసి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత మర్డర్ అని, థ్రిల్లర్ అని రెండు మూడు సినిమాలు ప్రకటించిన వర్మ.. 'పవర్ స్టార్'‌ పేరిట ఓ సినిమా తీస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా మొదలైనప్పటి నుండి రోజుకో పోస్టర్‌ను విడుదల చేస్తోన్న వర్మ తాజాగా మరో పోస్టర్‌ను ట్విట్టర్‌లో విడుదల చేశాడు. పూర్తి కథనం కోసం లింక్..

  #Prabhas21 : ప్రభాస్ సరసన దీపికా.. అధికారిక ప్రకటన

  ప్రభాస్  ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ అనే పేరుతో ఓ లవ్ స్టోరీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ప్రభాస్.. మహానటితో సూపర్ పాపులర్ అయిన నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నాడు. దీనికి సంబందించి అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నాడు. ఈ సినిమా ప్రకటన సందర్బంగా ఈ చిత్రం గురించి నాగ్ అశ్విన్ మాట్లాడుతూ ఇది కేవలం పాన్ ఇండియా సినిమా కాదని, పాన్ వరల్డ్ సినిమా అని పేర్కోన్నాడు. దీన్నిబట్టి చిత్రం ఎంత భారీగా ఉండనుందో అర్థమవుతోంది. ఈ చిత్రం కోసం భారీ తారాగణాన్ని తీసుకుంటున్నారు. ముఖ్యంగా హీరోయిన్ పాత్ర కోసం ప్రముఖ హిందీ నటి దీపికా పదుకొనేను తీసుకున్నారు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటనను చిత్రబృందం విడుదల చేసింది. పూర్తి కథనం కోసం లింక్..

  #HBDRajendraprasad : నవ్వుల రారాజుకు 64వ పుట్టినరోజు శుభాకాంక్షలు.. ప్రత్యేక కథనం..

  జేంద్ర ప్రసాద్.. నవ్వుల పండించడంలో ఆయనకు ఎదురలేదు. నట కిరీటిగా పేరుతెచ్చుకున్న రాజేంద్రుడు.. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. అయితే ఆయన కేవలం నవ్వులు మాత్రమే.. ఒక్కోసారి ఏడిపించేస్తాడు కూడా. మహేష్ శ్రీమంతుడులో ఓ సాధారణ రైతుగా ఎంతగా ఒదిగాడో.. ఊరు కోసం, ఊరి జనాల బాగు కోసం పాటుపడే పాత్రలో అదరగొడుతూ కన్నీరు పెట్టించాడు. ఇదంతా ఇప్పుడెందుకంటే ఈరోజు ఆయన పుట్టిన రోజు. రాజేంద్రప్రసాద్ 1956 జూలై 19వ తారీఖున.. గద్దె వెంకట నారాయణ, మాణిక్యాంబలకు కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించాడు.. ఆయన పూర్తి పేరు గద్దె రాజేంద్ర ప్రసాద్. పూర్తి కథనం కోసం లింక్..

  Puri Jagannadh : బోల్డ్ కంటెంట్‌తో వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తోన్న పూరి..

  డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ లాంటీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా ఫైటర్ అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు సగానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఆ చిత్రం లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. దీంతో ఇంట్లో ఖాలీగా ఉంటున్న పూరి ఈ లాక్ డౌన్ సమయంలో ఓ ఇంట్రస్టింగ్ స్క్రిప్ట్ రాస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి కథనం కోసం లింక్..
  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Prabhas 21, Tollywood news

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు