TOLLYWOOD TOP HERO PAWAN KALYAN INTERESTING FACTS ABOUT HOW TO BECOME POWER STAR HERE ARE THE DETAILS TA
Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు పవర్ స్టార్ అనే బిరుదు ఇచ్చింది ఎవరో తెలుసా..
పవన్ కళ్యాణ్ (Twitter/Photo)
Power Star Pawan Kalyan | పవన్ కళ్యాణ్.. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి అన్నకు తగ్గ తమ్ముడు అనిపించుకున్నాడు. ఆ తర్వాత పవన్ కళ్యాన్ .. పవర్ స్టార్ అయ్యాడు. ఐతే.. పవన్ కళ్యాణ్.. పవర్ స్టార్ వెనక ఇంట్రెస్టింగ్ స్టోరీ దాగుంది. వివరాల్లోకి వెళితే..
Power Star Pawan Kalyan: పవన్ కళ్యాణ్.. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి అన్నకు తగ్గ తమ్ముడు అనిపించుకున్నాడు. ఆ తర్వాత పవన్ కళ్యాన్ .. పవర్ స్టార్ అయ్యాడు. ఐతే.. పవన్ కళ్యాణ్.. పవర్ స్టార్ వెనక ఇంట్రెస్టింగ్ స్టోరీ దాగుంది. వివరాల్లోకి వెళితే.. ఇండస్ట్రీలో రాక ముందు పవన్ కళ్యాణ్ పేరు.. కళ్యాణ్ కుమార్. అంతకు ముందు పవన్ కల్యాణ్.. తన చిన్న అన్నయ్య నాగబాబు.. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మించిన పలు చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించారు. హీరోగా పవన్ కళ్యాణ్ మొదటి చిత్రం ‘‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమా. గీతా ఆర్ట్స్ బ్యానర్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఇవివి సత్యనారాయణ డైరెక్ట్ చేసారు. ఆ సినిమా అంతగా నడవలేదు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్.. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో ‘గోకులంలో సీత’ సినిమా చేసాడు. ఈ చిత్రం తమిళంలో హిట్టైన ‘గోకులతై సీతై’ సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్టైయింది.
ఇక ఆ చిత్రానికి పోసాని కృష్ణమురళి మాటలు అందించారు. ఈ సినిమా విడుదల సందర్భంగా పోసాని కృష్ణమురళి తొలిసారిగా విలేకరుల సమావేశంలో పవన్ కల్యాణ్‌ను పవన్ స్టార్ అని సంబోధించారు. ఆ తర్వాత చాలా పత్రికలు పవన్ కళ్యాణ్ పేరు ముందు పవర్ స్టార్ బిరుదుతో కథనాలు రాసాయి.
పవన్ కళ్యాణ్, పోసాని కృష్ణమురళి (File/Photos)
‘గోకులంలో సీత’ సినిమా నుంచి కళ్యాణ్ కుమార్ కాస్త పవన్ కళ్యాణ్ అయ్యాడు. ఆ తర్వాత సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్లో వచ్చిన ‘సుస్వాగతం’ సినిమాలో తొలిసారిగా పవన్ కళ్యాన్ పేరుకు ముందు పవర్ స్టార్ బిరుదుతో టైటిల్ కార్డ్ వేసారు. మొత్తానికి పవన్ కల్యాణ్.. పవర్ స్టార్ పేరు పెట్టడం వెనక పోసాని కృష్ణమురళి ఉన్నారు. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్‌తో పాటు పోసాని కూడా ప్రస్తావించారు కూడా. మొత్తానికి పవర్ స్టార్ అనే బిరుదుతో నిజంగానే పవన్ కళ్యాణ్.. తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్‌గా తన సత్తా చూపిస్తూనే ఉన్న సంగతి తెలిసిందే కదా.
వకీల్ సాబ్‌గా పవన్ కళ్యాణ్ (Twitter/Photo)
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్.. యాక్ట్ చేసిన ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్ రీసెంట్గా కంప్లీటైంది. ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్.. క్రిష్ దర్శకత్వంలో ఓ పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ మూవీ చేస్తున్నాడు. దాంతో పాటు హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి సినిమాలకు ఓకే చెప్పాడు. దాంతో పాటు మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ తెలుగు రీమేక్‌కు ఓకే చెప్పాడు. ఈ చిత్రంలో రానా మరో కథానాయకుడిగా నటిస్తున్నాడు. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రానికి ‘బిల్లా రంగా’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. దాంతో పాటు మరో రెండు మూడు చిత్రాలకు పవన్ కళ్యాణ్ ఓకే చెప్పారు. త్వరలో వాటికి సంబంధించిన అఫీషియల్ ప్రకటనలు వెలుబడే అవకాశం ఉంది.