అవును అభినవ మహానటిగా గుర్తింపు తెచ్చుకున్న సౌందర్య అకాల మరణం తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు దక్షిణాది చిత్ర పరిశ్రమను ఎంతో కృంగదీసింది. నిజంగా ఆమె మరణం తెలుగు సినీ ఇండస్ట్రీకి పెద్ద షాపం అనే చెప్పాలి. ఈ తరం ప్రేక్షకులకు సావిత్రి అంటే ఎలా ఉంటుందో సినిమాల్లో మాత్రమే చూసారు. కానీ నటన పరంగా చూసుకుంటే ఆ సావిత్రి అచ్చంగా ఇలాగే ఉండేదేమో అనేంతగా సౌందర్య అందర్నీ మంత్ర ముగ్దులను చేసారు. కానీ దురదృష్టవశాత్తు కేవలం 31 ఏళ్లకే హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసింది ఈమె. సరిగ్గా 16 ఏళ్ల కింద ఎప్రిల్ 17, 2004న సౌందర్య బీజేపీ తరుపున ఎన్నికల ప్రచారం నిమిత్తం తన అన్నయ్య కలిసి హెలికాప్టర్లో బయలుదేరింది. ఆ హెలికాప్టర్ టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే ఏదో సాంకేతిక కారణాలతో కుప్పకూలింది. దీంతో ఎంతో భవిష్యత్తు ఉన్న నటి అకాల మరణం చెందింది. ఆమె మరణం అభిమానులతో సామాన్య ప్రేక్షకులను కూడా కలిచి వేసింది. తమ ఇంట్లో సభ్యురాలు చనిపోయినంతగా ఫీలయ్యారు.ఆమె మరణం తెలుగు అగ్ర కథానాయకులందరిని కలిచివేసింది. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణకు సౌందర్య మరణం ఎక్కువ బాధ కలిగించింది.
వివరాల్లోకి వెళితే.. బాలకృష్ణ ఎప్పటి నుంచో తీయాలనకున్న తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘నర్తనశాల’ సినిమాను ఆయన ఓన్ దర్శకత్వంలో సౌందర్య ద్రౌపదిగా ఎంతో అట్టహాసంగా ప్రారంభించారు. ఈ చిత్రంలో బాలకృష్ణ.. అర్జునుడిగా, శ్రీకృష్ణుడిగా రెండు పాత్రల్లో నటించారు. కొన్ని రోజులు షూటింగ్ కూడా జరిగింది. ఈ చిత్రంలో ధర్మరాజుగా శరత్ బాబు, భీముడిగా శ్రీహరి.. దుర్యోధనుడి పాత్రలో సాయి కుమార్‌ను తీసుకున్నారు. కానీ ద్రౌపది వేషధారి సౌందర్య అకాల మరణం ఈ సినిమాపై పడింది. దాదాపు 60 శాతం షూటింగ్ కంప్లీటైన ఈ చిత్రాన్ని తర్వాత కొనసాగిద్దామకున్నారు కానీ.. ఆ తర్వాత బాలయ్యకు విజయేంద్ర వర్మ షూటింగ్ సమయంలో బిల్డింగ్ మీద నుంచి కింద పడి కాలు ఫ్యాక్చర్ కావడం.. ఆ తర్వాత ఇంట్లో కాల్పుల ఘటన తదితర సంఘటనలు జరిగాయి. ఆ కారణాలను బ్యాడ్ సెంటిమెంట్‌గా భావించి ఈ సినిమాను మధ్యలో ఆపేసారు బాలయ్య. ఆ తర్వాత శ్రీరామరాజ్యం తర్వాత నయనతారతో ఈ సినిమా స్క్రిప్ట్‌కు దుమ్ము దులిపే పనిలో పడ్డారు బాలయ్య. కానీ ఎందుకనో మళ్లీ ఆ బ్యాడ్ సెంటిమెంట్ గుర్తుకు వచ్చి ఇక నర్తనశాల జోలికి పోవద్దనే గట్టి నిర్ణయానికి వచ్చారు. ఏమైనా సౌందర్య మరణంతో ఒక మంచి సినిమాను ప్రేక్షకులకు దూరం చేసిందనే చెప్పాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.