హీరోయిన్‌తో అగ్ర దర్శకుడి ఎఫైర్.. ఇంట్లో ఇల్లాలు బయట ప్రియురాలు..

తెలుగు ఇండస్ట్రీలో ఆయన ఓ పేరు మోసిన దర్శకుడు.. స్టార్ హీరోలకు ఆయనతో సినిమా అంటే ఎగిరి గంతేస్తుంటారు. తనదైన డైలాగులతో పిచ్చెక్కించడం ఆయన స్టైల్. కేవలం సినిమాలతోనే కాదు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 17, 2019, 7:40 PM IST
హీరోయిన్‌తో అగ్ర దర్శకుడి ఎఫైర్.. ఇంట్లో ఇల్లాలు బయట ప్రియురాలు..
ప్రతీతాత్మక చిత్రం
  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో ఆయన ఓ పేరు మోసిన దర్శకుడు.. స్టార్ హీరోలకు ఆయనతో సినిమా అంటే ఎగిరి గంతేస్తుంటారు. తనదైన డైలాగులతో పిచ్చెక్కించడం ఆయన స్టైల్. కేవలం సినిమాలతోనే కాదు.. ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఎఫైర్స్‌తో కూడా వార్తల్లో నిలవడం ఆయన స్టైల్. ఇప్పటికే గతంలో ఇద్దరు ముగ్గురు స్టార్ హీరోయిన్లతో ఎఫైర్స్ ఉన్నాయనే రూమర్స్ కూడా ఆయన చుట్టూనే ఉన్నాయి. ఈయన పేరు ఎప్పుడూ టాలీవుడ్ గాసిప్ సర్కిల్స్‌లో పెద్ద పెద్ద అక్షరాలతో తిరుగుతుంటుంది. తన సినిమాలతో ఎలాంటి బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తాడో.. హీరోయిన్లను మార్చే క్రమంలో కూడా అన్నే రికార్డులు తిరగరాస్తుంటాడు ఆ ప్రముఖ దర్శకుడు.

ప్రతీతాత్మక చిత్రం


సీజన్ సీజన్‌కు ఓ హీరోయిన్‌తో ఎఫైర్ మెయింటేన్ చేయడం ఈయన స్టైల్. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. పదేళ్ళ కింద అప్పటి స్టార్ హీరోయిన్‌తో కొన్నాళ్లు రిలేషన్ షిప్‌లో ఉండి రెండు సినిమాలు చేసాడు.. ఆ తర్వాత ఫేడవుట్ అయిన హీరోయిన్‌కు వరసగా రెండు ఆఫర్స్ ఇచ్చి ఆమెతో కూడా ఎఫైర్ నడిపించాడనే వార్తలున్నాయి. ఇక టాలీవుడ్‌లో చక్రం తిప్పిన ఓ నెంబర్ వన్ హీరోయిన్‌తో మూడు సినిమాలు చేసి కొన్ని రోజులు ఆమెతో కూడా ఎఫైర్ నడిపాడనే ప్రచారం ఈయనపై ఉంది. అయితే ఓ సారి హీరోయిన్‌తో ఉన్నపుడు భార్యకు అడ్డంగా దొరికిపోవడంతో రెండేళ్లుగా తన పని తాను చేసుకుంటున్న ఈయన చూపులు ఇప్పుడు ఓ తెలుగమ్మాయిపై పడ్డాయని తెలుస్తుంది.

ప్రతీతాత్మక చిత్రం
గతేడాది ఓ పెద్ద సినిమాలో ఈమెకు కూడా అవకాశం ఇచ్చాడు ఈయన. ఈ సినిమా సమయంలోనే ఆమెతో మన రొమాంటిక్ దర్శకుడు రిలేషన్ షిప్‌లోకి వెళ్లిపోయాడని.. అప్పట్నుంచి ఆ చిన్న నటితోనే ఎఫైర్ సాగిస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. వారిద్దరి మధ్య రిలేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోతుంది. ఈ సాన్నిహిత్యం గురించి కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో తాను ఎఫైర్ నడిపిన హీరోయిన్లతో కూడా ఇప్పటికీ మనోడు కాస్త టచ్‌లోనే ఉన్నాడు.. అంతలోనే మరో తాజా ఎఫైర్ కూడా మొదలైంది. ప్రస్తుతం ఈయన ఓ స్టార్ హీరోతో పెద్ద సినిమా చేస్తున్నాడు. త్వరలోనే అది విడుదల కానుంది కూడా.
First published: November 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...