Trivikram: దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త..

త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas)

Trivikram: దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త. అవును చెవుల్లో తేనే పోసినంత ఆనంద పడిపోయే ఆ వార్త ఏమిటో కాదు.

  • Share this:
    Trivikram: దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త. అవును చెవుల్లో తేనే పోసినంత ఆనంద పడిపోయే ఆ వార్త ఏమిటో కాదు. మాటల మాంత్రికుడు కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే కదా.  ప్రస్తుతం  మన దేశంలో  క‌రోనా  సెకండ్ వేవ్  తీవ్ర రూపం దాలుస్తోంది. గ‌త రెండు వారాలుగా  దేశ‌వ్యాప్తంగా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ పోతూనే ఉన్నాయి కానీ ఏ మాత్రం తగ్గడం లేదు.  ఈ క్ర‌మంలో షూటింగ్‌ల‌లో పాల్గొంటున్న సినీ ప్ర‌ముఖులు ఒక్కొక్క‌రుగా ఈ వైర‌స్ బారిన ప‌డుతున్నారు. ఇప్పటికే అక్షయ్ కుమార్, గోవిందా , ఆమీర్ ఖాన్, కత్రినా, ఆలియా, రణ్‌బీర్ కపూర్ వంటి వాళ్లు సెకండ్ వేవ్‌లో కరోనా బారిన పడ్డారు. టాలీవుడ్ నుంచి త్రివిక్రమ్, అల్లు అరవింద్ వంటి వాళ్లు కరోనా బారిన పడ్డారు. అల్లు అరవింద్ రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకున్న కోవిడ్ బారిన పడ్డారు. తాజాగా కరోనా నుంచి త్రివిక్రమ్ శ్రీనివాస్ కోలుకున్నట్టు సమాచారం.

    కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత త్రివిక్రమ్‌కు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. డాక్టర్ల సలహా మేరకు హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకొని దాదాపు 11 రోజుల తర్వాత కరోనా నుంచి కోలుకున్నారు. శ్రీరామ నవమి నుంచి తిరిగి తన పనులు మొద పెట్టేలా ప్రణాళికల రచించినట్టు సమాచారం. ప్రస్తుతం మాటల మాంత్రికుడు.. పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా తెరకెక్కుతోన్న ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ తెలుగు రీమేక్‌కు మాటలు అందిస్తున్నాడు. మరోవైపు ఎన్టీఆర్ 30వ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. ఈ సినిమా మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానున్నట్టు సమాచారం.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: