Koratala Siva: కొరటాల శివకు కూడా అదే సమస్య.. మూడేళ్ల నుంచి ఒకే సినిమా అవ్వడంతో ఈ సమస్య?

Koratala Siva

Koratala Siva: గత రెండేళ్ల నుండి కరోనా మహమ్మారి వల్ల ఎన్ని నష్టాలు జరిగాయో అందరికీ తెలిసిందే. ఇక ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోలేని దెబ్బను ఎదుర్కొంది. కరోనా ప్రారంభ నుండి ఇప్పటివరకు దర్శక నిర్మాతలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.

  • Share this:
    Koratala Siva: గత రెండేళ్ల నుండి కరోనా మహమ్మారి వల్ల ఎన్ని నష్టాలు జరిగాయో అందరికీ తెలిసిందే. ఇక ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోలేని దెబ్బను ఎదుర్కొంది. కరోనా ప్రారంభ నుండి ఇప్పటివరకు దర్శక నిర్మాతలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మంచి సమయంలో స్టార్ హీరోలతో వరుస సినిమాలను ప్లాన్ చేసి కరెక్ట్ సినిమా మధ్యలో ఈ మహమ్మారి రావడంతో సినిమాలు మధ్యలోనే ఎన్నోసార్లు వాయిదా పడే స్థితిలో వచ్చాయి. దీంతో సినిమా షూటింగ్ కి తయారుచేసిన సెట్ లు, సినిమా కోసం చేసిన అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడుతున్నారు. అందులో డైరెక్టర్ కొరటాల శివ కూడా ఆర్థికంగా ఒత్తిడికి గురవుతున్నట్లు తెలిసింది.

    తెలుగు సినీ ఇండస్ట్రీలో కొరటాల శివ దర్శకత్వం గురించి అందరికీ తెలిసిందే. తన దర్శకత్వంతో మంచి మంచి సినిమాలను తెరకెక్కించి మంచి సక్సెస్ లు అందుకుంటున్నాడు. ప్రస్తుతం ఈయన దర్శకత్వంలో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఆచార్య సినిమా రూపొందుతుంది. ఇక ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ నిరంజన్ రెడ్డి తో కొణిదెల నిర్మాణ కంపెనీ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

    ఇక ఈ సినిమా షూటింగ్ కోవిడ్ ముందే ప్రారంభించగా ఇప్పటికి ఎన్నో సార్లు వాయిదా పడుతూ వచ్చింది. అయినా కూడా ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తవలేదు. ఇక ఈ సినిమా కోసం ముందుగానే అప్పులు తీసుకున్న కొరటాలకు ఇప్పుడు బాగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిసింది. అనుకున్నట్లుగానే ఎటువంటి అడ్డంకులు లేకుండా సినిమా మంచిగా పూర్తయి విడుదల కూడా అయ్యేది. అంతేకాకుండా ఆర్థికంగా కూడా ఎన్నో లాభాలు వచ్చేవి.

    ఇది కూడా చదవండి:కొడుకుల గురించి చెప్తూ మురిసిపోయిన జూనియర్ ఎన్టీఆర్.. ఇద్దరు ఇద్దరే అంటూ?

    ఇక తాము చేసుకున్న ప్లాన్ మొత్తం తలక్రిందులు కావడంతో ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమా కోసం తీసుకున్న డబ్బు వడ్డీలు బాగా పెరిగాయట. దీంతో ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బందిలో ఉన్నారని తెలిసింది. చిరంజీవి తో పాటు రామ్ చరణ్ కూడా పారితోషకం తీసుకుంటున్నాడని తెలిసింది. ఇక రామ్ చరణ్ నిరంజన్ రెడ్డి కి ప్రాఫిట్స్ అందజేస్తానని మాట ఇచ్చాడట. కానీ కొరటాల శివ కూడా ఇప్పటివరకు తన పారితోషకం అందలేదని తెలిసింది. దీంతో ఆర్థికంగా ఒత్తిడికి గురవుతున్నారని తెలిసింది.

    ఇది కూడా చదవండి:రాజమౌళి, కొరటాల గడగడలాడించిన ఎన్టీఆర్.. ఆ ప్రశ్నలతో చమటలు పట్టించేశాడుగా!

    ప్రస్తుతం లాభాల కోసం సినిమా విడుదల చేయాలన్న కూడా థియేటర్ లలో 100% ఆక్యుపెన్సీ లేదు అని ఒకవేళ అవకాశం ఇస్తే మాత్రం వీలైనంత తొందరగా సినిమా విడుదల చేయాలని అనుకుంటున్నారని తెలిసింది. లేదంటే మళ్లీ ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాను భారీ ధర తో కొనడానికి ముందుకు వచ్చినా కూడా పరిస్థితులు బట్టి నష్టపోతామేమో అని ఆలోచనలో పడ్డారని తెలిసింది. అంతేకాకుండా డిజిటల్, శాటిలైట్, డబ్బింగ్ రైట్స్ ని కూడా అమ్మారని కేవలం థియేటర్ మాత్రమే ఉందని తెలిసింది.
    Published by:Navya Reddy
    First published: