బాలయ్యకు విలన్‌గా కమెడియన్.. బోయపాటి సినిమాలో చిత్రం..

అదేంటి.. బాలయ్య సినిమా అంటే ఎలా ఉంటుంది..? పవర్ ఫుల్‌గా యాక్షన్ ఓరియెంటెడ్‌గా ఉంటుంది కదా.. అలాంటి సినిమాలో కమెడియన్ విలన్ ఎలా అవుతాడు..? ఆయన రేంజ్ విలన్ కావాలి కదా అనుకుంటున్నారా..?

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 27, 2020, 8:06 PM IST
బాలయ్యకు విలన్‌గా కమెడియన్.. బోయపాటి సినిమాలో చిత్రం..
బాలకృష్ణ, బోయపాటి శ్రీను (Facebook/Photos)
  • Share this:
అదేంటి.. బాలయ్య సినిమా అంటే ఎలా ఉంటుంది..? పవర్ ఫుల్‌గా యాక్షన్ ఓరియెంటెడ్‌గా ఉంటుంది కదా.. అలాంటి సినిమాలో కమెడియన్ విలన్ ఎలా అవుతాడు..? ఆయన రేంజ్ విలన్ కావాలి కదా అనుకుంటున్నారా..? ఏమో మరి.. ప్రయోగాలు చేయడానికి బాలయ్య ఎప్పుడూ ముందే ఉంటాడు. ఈయన త్వరలోనే బోయపాటి సినిమాతో బిజీ కానున్నాడు. రూలర్ సినిమా తర్వాత కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్నాడు ఈయన. పైగా గెటప్ కూడా మార్చేస్తున్నాడు. ఈ మధ్యే బోయపాటి సినిమా కోసం పూర్తిగా కొత్త లుక్‌లోకి మారిపోయాడు నందమూరి నటసింహం. అంతేకాదు.. ఈ చిత్రం కోసం బరువు కూడా భారీగానే తగ్గిపోయాడు.

బాలయ్య సినిమాలో నటించబోతున్న సునీల్


రూలర్ సినిమా కోసమే దాదాపు 11 కేజీలు తగ్గిన బాలయ్య.. ఇప్పుడు బోయపాటి కోసం మరో 10 కేజీలు తగ్గిపోతున్నాడు. ఈ సినిమా కోసమే తనను తాను చాలా మార్చుకుంటున్నాడు ఈ హీరో. ఇక ఈ చిత్రంలో విలన్‌గా ఎవరు నటిస్తున్నారనేది ఆసక్తికరంగా మారింది. లెజెండ్ సినిమాతో జగపతిబాబుకు లైఫ్ ఇచ్చిన బోయపాటి.. ఇప్పుడు మరోసారి కొత్త విలన్‌ను చూపించాలని ఫిక్సైపోయాడు. రాజశేఖర్ లాంటి హీరోల పేర్లు కూడా వినిపించాయి కానీ ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం కమెడియన్ సునీల్ ఇందులో కీలక పాత్రలో నటించబోతున్నాడు. అయితే ఈయన చేయబోయే పాత్ర కమెడియన్ కాదు.. విలన్ అనే ప్రచారం కూడా జరుగుతుంది.

బాలయ్య సినిమాలో నటించబోతున్న సునీల్
ఈ మధ్యే విడుదలైన రవితేజ డిస్కో రాజా సినిమాలో ఈయన ప్రతినాయక పాత్రలో నటించాడు. అయితే ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపించలేదు.. దాంతో సునీల్ విలన్ అవతారం ఎవరూ పెద్దగా గుర్తు పెట్టుకోలేదు.. గుర్తింపు కూడా రాలేదు. కానీ బాలయ్య సినిమాలో విలన్‌‌గా నటిస్తే మాత్రం రచ్చ లేపడం ఖాయం. అందులోనూ బోయపాటి సినిమా అంటే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇప్పుడు ఇదే చేయబోతున్నాడని తెలుస్తుంది. పైగా తనకు విలన్ రోల్స్ అంటే మహా ఇష్టమని.. తాను అది చేయాలనే ఇండస్ట్రీకి వచ్చానని చాలా సార్లు చెప్పాడు సునీల్. మరి బోయపాటి దాన్ని నిజం చేసి చూపిస్తాడేమో చూడాలిక.
First published: January 27, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు